బాలకృష్ణ (Balakrishna) అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఎప్పటి నుంచి అంటే.. ముహూర్తం కుదిరినట్టేనా?

Updated on Jun 14, 2022 01:05 AM IST
బాలకృష్ణ (Balakrishna) అన్‌స్టాపబుల్‌ పోస్టర్
బాలకృష్ణ (Balakrishna) అన్‌స్టాపబుల్‌ పోస్టర్

నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) పోయినేడాది హోస్ట్ అవతారం ఎత్తాడు. ఆహా ఓటీటీ వేదికగా వచ్చిన అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే షోను తనదైన శైలిలో ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాడు. ఇప్పటికే ఈ షో ఫస్ట్ సీజన్ పూర్తి చేసుకుంది. ఫస్ట్ సీజన్ పూర్తయినప్పటి నుంచి రెండో సీజన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని బాలయ్య అభిమానులతోపాటు అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆహాలో ప్రసారమవుతున్న మరో షో తెలుగు ఇండియన్ ఐడల్‌కు గెస్ట్‌గా వచ్చిన బాలయ్య.. రెండో సీజన్‌ గురించి ప్రస్తావించారు.

మోహన్‌బాబుతో మొదలైన అన్‌స్టాపబుత్‌ విత్‌ ఎన్‌బీకే షో మొదటి సీజన్‌.. సూపర్‌‌స్టార్‌‌ మహేష్‌బాబు గెస్ట్‌గా వచ్చిన ఎపిసోడ్‌తో ఎండ్‌ అయ్యింది. ఈ షో మొదలైన తర్వాత ఆహా ఓటీటీకి సబ్‌స్క్రైబర్స్ విపరీతంగా పెరిగారు అనడంతో సందేహమే లేదు. ఇక,  అన్‌స్టాపబుత్‌ విత్‌ ఎన్‌బీకే షో రెండో సీజన్ ఎప్పుడు స్టార్ట్‌ అవుతుంది అనే దానిపై తెలుగు ఇండియన్ ఐడల్‌ షోలో నందమూరి బాలకృష్ణ హింట్‌ ఇచ్చాడు. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు బాలయ్య. అలాగే తల్లి బసవతారకం పేరు మీద మొదలుపెట్టిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

నందమూరి బాలకృష్ణ (BalaKrishna), డైరెక్టర్‌‌ సుకుమార్, ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్

సరికొత్త బాలయ్య..

ఇవన్నీ బాలయ్య చాలా కాలంగా చేస్తున్న పనులే.. కాగా వీటికి అదనంగా ఆహా ఓటీటీలో షోలో యాంకర్‌‌గా కొత్త అవతారం ఎత్తాడు. పెద్ద సెలబ్రిటీ అయ్యుండి కూడా తన తోటి నటీనటులను ఇంటర్వ్యూ చేసే క్రమంలో బాలయ్య చేసిన అల్లరి.. ప్రశ్నలు వేస్తూ వాళ్లను నవ్వించడం..డైలాగులు.. వీటన్నింటికీ మించి వాళ్లు చేసే సేవా కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడం.. వాళ్లతో సరదా సరదా ఆటలు, పాటలు, ప్రతి షో చివరిలోనూ సమాజానికి సేవ చేసే వాళ్లను పరిచయం చేయడం లేదా కష్టాల్లో ఉన్న వాళ్లను ఆదుకోవడం వంటి పలు విశేషాలతో అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే షోను పీక్స్‌కు తీసుకెళ్లాడు బాలకృష్ణ.

నందమూరి బాలకృష్ణ (BalaKrishna)

ఐఎండీబీ నంబర్ వన్‌ ర్యాంక్..

అందుకేనేమో ఐఎండీబీ (ఇంటర్నెట్‌ మూవీ డేటా బేస్‌) ర్యాంకింగ్స్‌లో ‘ది కపిల్ శర్మ’ షోను కూడా వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే. రెండో ప్లేస్‌లో ‘ది కపిల్‌ శర్మ’ షో ఉండగా.. ఐశ్వర్యారాయ్ చేస్తున్న అమెజాన్ ఫ్యాషన్‌ షో పదో స్థానంలో నిలిచింది.

తొలి సీజన్‌లో  ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి వాళ్లతో బాలయ్య సందడిని చూడాలనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. అన్‌స్టాపబుల్‌ విత్‌ బాలయ్య సీజన్‌2కు ఫస్ట్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని టాక్‌.

 

నందమూరి బాలకృష్ణ (BalaKrishna)

అన్‌స్టాపబుల్ షోలో  బాలయ్య  తన ప్రశ్నలతో గెస్ట్‌లను ఆటపట్టించడమే కాకుండా.. తనపై వచ్చిన గాసిప్స్‌కు కూడా ఈ షో ద్వారా క్లారిటీ ఇచ్చేస్తున్నారు. బాలయ్యకు రవితేజకు మధ్య గొడవ జరిగిందని దశాబ్దం క్రితం చాలా వార్తలు వ్యాపించాయి. అప్పుడు వచ్చిన గాసిప్స్‌పై రవితేజతోనే క్లారిటీ ఇప్పించి.. అటువంటిది ఏమీ లేదని తేల్చేశాడు బాలయ్య. ఇక, అంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా తన సినిమాలపై తానే వ్యంగ్యాస్త్రాలు విసురుకుంటూ, తనదైన శైలిలో అభిమానులను అలరిస్తున్నాడు. రవితేజతో జరిగిన షోలో తాను నటించిన నిప్పురవ్వ సినిమాపై సెటైర్‌‌ వేసుకున్న బాలయ్య.. ఆ సినిమాలో రవితేజ నటించకపోవడం అదృష్టం అని కూడా అన్నాడు. షూటింగ్ జరుగుతున్నప్పుడే నిప్పురవ్వ సినిమా డిజాస్టర్ అవుతుందని అర్ధం అయ్యిందని కూడా చెప్పి నిజాన్ని నిర్భయంగా చెప్పే శైలి తనదని మరోసారి నిరూపించుకున్నాడు బాలకృష్ణ (Balakrishna).

 

Read More: ఒకే రియాలిటీ షోలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ.. ఇది ఎలా సాధ్యమైంది?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!