‘ఇండియన్‌ ఏయిర్‌ ఫోర్స్‌ డే’ (Indian Airforce Day) సందర్భంగా 'VT13' (Varun Tej) స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్!

Updated on Oct 08, 2022 05:29 PM IST
శనివారం ‘ఇండియన్‌ ఏయిర్‌ ఫోర్స్‌ డే’ (Indian Airforce Day) సందర్భంగా 'VT13' మేకర్స్‌ స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.
శనివారం ‘ఇండియన్‌ ఏయిర్‌ ఫోర్స్‌ డే’ (Indian Airforce Day) సందర్భంగా 'VT13' మేకర్స్‌ స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) ఇటీవల తన కెరీర్‌లోని 13వ చిత్రాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. శక్తి ప్రతాప్ సింగ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. 'VT13' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగిపోతున్నాయి.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చివరగా 'గని' (Ghani Movie) మూవీలో బాక్సర్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాపై వరుణ్ తేజ్ భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఎంతో కఠోరంగా శ్రమించి బాక్సర్ గా ట్రాన్స్ ఫామ్ అయి రిస్క్ చేసినా ఈ ప్రాజెక్ట్ వరుణ్ తేజ్ ని తీవ్ర నిరాశకు గురిచేయడమే కాకుండా భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో కొంత విరామం తీసుకున్న వరుణ్ తేజ్ ఇండియన్ ఏయిర్ ఫోర్స్ కు సంబంధించిన కథతో ప్రస్తుతం భారీ మూవీకి శ్రీకారం చుట్టాడు.

'VT13' నుంచి ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్‌ పొస్టర్‌, స్పెషల్‌ వీడియోకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం మరో పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. శనివారం ‘ఇండియన్‌ ఏయిర్‌ ఫోర్స్‌ డే’ (Indian Airforce Day) సందర్భంగా మేకర్స్‌ స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో యుద్ధ విమానం వద్దకు ఏయిర్‌ వింగ్‌ కమాండర్‌ నడుచుకుంటూ వస్తున్నట్లు ఉంది. లేటెస్ట్‌గా విడుదలైన ఈ పోస్టర్‌కు విశేష స్పందన వస్తోంది.

ఇదిలా ఉంటే.. 'VT13' సినిమాను సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించబోతున్నాయి. కొన్ని రోజుల క్రితమే మేకర్స్ ఈ మూవీని అధికారికంగా ప్రకటించడమే కాకుండా లాంఛనంగా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. తెలుగు హిందీ భాషల్లో ఏక కాలంలో రూపొందనున్న ఈ సినిమాతో వరుణ్ తేజ్ (Varun Tej) బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.

Read More: 'ఆకాశంలో జరిగే యుద్ధాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి'.. వరుణ్ తేజ్ (Varun Tej13) కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!