'ఆకాశంలో జరిగే యుద్ధాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి'.. వరుణ్ తేజ్ (Varun Tej13) కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్

Updated on Sep 19, 2022 01:59 PM IST
వరుణ్ తేజ్ తర్వాతి మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ (VT13 First Look Poster) కూడా విడుదలయింది.
వరుణ్ తేజ్ తర్వాతి మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ (VT13 First Look Poster) కూడా విడుదలయింది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'గని' సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తరువాత వరుణ్ తేజ్, వెంకటేష్ మల్టీ స్టారర్ గా రూపొందిన 'ఎఫ్3' (F3) సినిమా ఫస్టు పార్ట్ (ఎఫ్2) స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ మెగా హీరో తదుపరి సినిమా ఎవరితో ఉండనుందా అనే ఆసక్తి అన్ని వర్గాల్లో మొదలైంది. 

ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ తర్వాతి మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ (VT13 First Look Poster) కూడా విడుదలయింది. 'ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో అవధులు లేని ధైర్యసాహసాలు, శౌర్యం ఉంది. ఆకాశంలో జరిగే యుద్ధాన్ని బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు సిద్ధంగా ఉండండి. త్వరలో మొదలు కాబోతుంది..' అంటూ ట్విటర్ లో రాసుకొచ్చారు.

ఇక, ఈ సినిమాకు సంబంధించి అంతకు ముందు విడుదల చేసిన ఓ చిన్న వీడియో ఆసక్తిని పెంచిన విషయం తెలిసిందే. ఎయిర్‌ ఫోర్స్‌ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు ప్రకటించడంతో అందరిలోనూ ఈ సినిమా కథపై ఆసక్తి పెరిగింది.

ఇక తాజాగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్ లో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) ఓ ఏయిర్‌ వింగ్ కమాండర్‌ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ లో వరుణ్ తేజ్ వెనుక నుంచి యుద్ధ విమానాల వైపు నడుస్తున్నట్లు ఉంది.

వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత 'VT13' మూవీ పట్టాలెక్కించే అవకాశం ఉంది. సోని పిక్చర్స్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ప్రొడ‌క్షన్స్, రెన్నాయ్‌సెన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి శ‌క్తి ప్రతాప్ సింగ్ అనే యంగ్‌ డైరెక్టర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

Read More: మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) దేశభక్తి చిత్రంలో నటిస్తున్నారా? ఈ చిత్రం గురించి టాప్ 5 ఆసక్తికర విషయాలు !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!