Ranbir Kapoor: టాలీవుడ్ హీరోలపై రణ్‌బీర్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఫేవరెట్ హీరో ఎవరంటే?
Ranbir Kapoor: రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ (Alia Bhatt) తొలిసారి జంటగా కనిపించబోతున్న సినిమా 'బ్రహ్మాస్త్ర' (Brahmastra). అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) డైరెక్షన్‌లో మల్టీస్టారర్‌గా వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు రెడీ అవుతోంది. పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా వైజాగ్‌లో సందడి చేసింది రణ్‌బీర్ కపూర్ టీం.
ఈ కార్యక్రమంలో బ్రహ్మాస్త్ర హీరో రణ్‌బీర్ కపూర్, చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ (Ayan Mukharji) పాల్గొనగా.. టాలీవుడ్ ఫేమస్ దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. అయితే ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో తెలుగులో మీ ఫేవరెట్ హీరో ఎవరు అనే ప్రశ్న రణ్‌బీర్‌కు ఎదురైంది. దీంతో ఆయన అందరు తెలుగు హీరోలను చుట్టేస్తూ ఆసక్తికరంగా స్పందించారు. తెలుగు యాక్టర్స్ అందరు కూడా గొప్పవారే అంటూ టాలీవుడ్‌పై ఉన్న ఇష్టాన్ని బయటపెట్టారు రణ్‌బీర్ కపూర్.
తనకు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మ్యానిరిజం అంటే చాలా ఇష్టమని చెప్పి అక్కడి వాతావరణంలో జోష్ నింపిన ఆయన.. ఫేవరేట్ హీరో అంటే మాత్రం బాహుబలి స్టార్ ప్రభాస్ (Prabhas) అని అన్నారు. ప్రభాస్ నాకు చాలా మంచి మిత్రుడు అని రణ్‌బీర్ కపూర్ చెప్పారు. బ్రహ్మాస్త సినిమా ట్రైలర్ జూన్ 15 న రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ఇక రణబీర్ కపూర్ ను స్వయంగా కలిసే అవకాశం రావడంతో చాలామంది ఫాన్స్ హ్యాపీ ఫీల్ అయ్యారు. మొత్తం మూడు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ కు జోడీ గా అలియా భట్ నటించగా ప్రత్యేక పాత్రల్లో బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున, మౌని రాయ్ నటిస్తున్నారు. వైజాగ్ ఈవెంట్ కు రాలేకపోయిన నాగార్జున, అలియా భట్ లు ఫాన్స్ కు తమ వీడియో మెసేజ్ లు పంపుతూ.. టీమ్ కు విషెస్ తెలిపారు.
అయితే, అన్ని దక్షిణాది భాషల్లో ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) సమర్పిస్తుండటం మరో విశేషం. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, రణ్‌బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్నో గొప్ప గొప్ప కథలు, పురాణ ఇతిహాసాలు ఉన్న మన భారతీయ చరిత్రను ప్రపంచానికి తెలియజేయాలనే ఆలోచన నుంచి పుట్టిన చిత్రమే ఈ బ్రహ్మస్త్ర అని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అంటున్నారు. చిన్నప్పటినుంచి విన్న కథలు, ప్రాచీన భారతీయ సంస్కృతి మూలాలు ఈ సినిమాకి ఆధారం అని ఆయన చెబుతున్నారు.