F3 Movie: ఎఫ్3 సినిమాలో నటుడు సుమన్ పాట.. హీరో వెంకటేష్ పై ఆసక్తికర వ్యాఖ్యలు!

Updated on Jun 03, 2022 03:30 PM IST
నటుడు సుమన్, ఎఫ్3 పోస్టర్ (Tollywood Actor Suman, F3 Poster)
నటుడు సుమన్, ఎఫ్3 పోస్టర్ (Tollywood Actor Suman, F3 Poster)

Tollywood Hero Suman: టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా 'ఎఫ్ 3'. ఈ మూవీ కామెడీ ఎంటర్ టైనర్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలోని పలు కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను తెగ నవ్విస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలో ఒక సన్నివేశం కోసం హీరోలిద్దరూ.. కొన్ని పాత సినిమాల పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఆ సన్నివేశం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వెంకటేష్ లాంటి పెద్ద హీరోల సినిమాల్లో అలాంటి పాటలతో సన్నివేశాన్ని డిజైన్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. 

సాధారణంగా హీరోలు ఎవరైనా చాలా వరకు తమ సినిమాల పాటలు లేదా తమ ఫ్యామిలీ హీరోల పాటలు తప్ప బయటి హీరోల పాటలను చేసేందుకు అంతగా ఆసక్తి చూపించరు. కానీ ఎఫ్ 3 లో మాత్రం దర్శకుడు ఆ ఇద్దరు హీరోలను ఒప్పించి పలు పాటలను చూపించాడు. అందులో ఒకటి అప్పటి హీరో సుమన్ నటించిన 'చిన్నల్లుడు' సినిమాలోని 'కుర్రాడు బాబోయ్' పాట. ఎఫ్3 లో విక్టరీ వెంకటేష్ ఆ పాత సూపర్ హిట్ పాటకు డాన్స్ చేశాడు. అయితే,  'చిన్నల్లుడు' సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు అప్పట్లో పాటలు కూడా బాగా ఫేమస్ అయ్యాయి. ఇప్పటికి కూడా ఆ పాటలు అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం. అంతటి ఘన విజయం సాధించిన పాట అవ్వడం వల్లే ఎఫ్ 3 లో పెట్టారు.

ఈ నేపథ్యంలో హీరో సుమన్ స్పందిస్తూ.. వెంకటేశ్ తన పాటను ఎంపిక చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందని అన్నారు. అప్పట్లో హిట్ అయిన సాంగ్‌ను ఇప్పుడు చూస్తుంటే ఇంకా ఆనందంగా ఉందని చెప్పారు. తాను ఈ సినిమాను ఇంకా థియేటర్లలో చూడలేదని.. అందరూ తన సాంగ్ F3 మూవీలో ఉందని చెప్పడంతో ఫస్ట్ షాక్ అయ్యాయని అన్నారు. 

'వెంకటేష్‌కు మనస్పూర్తిగా ధన్యవాదాలు. నా సాంగ్‌ను ఆయన సినిమాలో పెట్టుకుని.. నాకు మళ్లీ పాత జ్ఞాపకాలు గుర్తుచేశారు' అని సుమన్ అన్నారు. ఒక హీరో పాటకు మరో హీరో డ్యాన్స్ చేసేందుకు ఆసక్తి చూపించరు. కాని వెంకటేష్ మాత్రం అలా కాదు. ఆయన చాలా ఓపెన్ గా ఉంటారు... మంచి మనిషి. వెంకీ ఎలాంటి పాత్రలు అయినా చేసేందుకు ముందుకు రావడం ఆయన గొప్ప వ్యక్తిత్వం కు నిదర్శనం అని కొనియాడారు. 

ఇక, తన తదుపరి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. తెలుగులో 'అల్లూరి', 'సిద్ధన్న గట్టున' సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయన్నారు. మలయాళంలో మోహన్‌లాల్‌తో కలిసి నటిస్తున్నానని చెప్పారు. కన్నడలో రెండు మూడు సినిమాలు, ఒడియాలో రెండు సినిమాలు చేస్తున్నట్లు తెలిపారు. అప్పట్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన డైనమిక్ హీరో సుమన్. చిరంజీవికి ధీటుగా ఎదిగిన ఈ సీనియర్ హీరో కొన్ని వివాదాల్లో ఇరుక్కొని ఇండస్ట్రీలో క్రేజ్ కోల్పోయాడు. 

ఆయన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు.. చేయని తప్పుకు జైలుకు వెళ్లడం, మళ్లీ తిరిగి రావడం.. హీరోగా నిలదొక్కుకోవడం ఇలా ఎన్నో కష్టాలను ఆయన అనుభవించారు. అయితే ఆ తరువాత అన్నమయ్య మూవీలో వెంకటేశ్వరస్వామిగా కనిపించి.. సహాయనటుడిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు సుమన్. రాజకీయాలు కావొచ్చు , సినిమాలు అవ్వొచ్చు.. నిర్మొహమాటంగా మాట్లాడటం హీరో సుమన్ స్టైల్.

Read More: ఎఫ్3 (F3) నాలుగు రోజుల్లో అంత వ‌సూళ్లు చేసిందా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!