'ది ఘోస్ట్' దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో వరుణ్ తేజ్ (Varun Tej) యాక్షన్ డ్రామా.. లండన్ లో షూటింగ్ ప్రారంభం!

Updated on Oct 13, 2022 12:57 PM IST
వరుణ్ తేజ్ (Varun Tej) ఇటీవలే తన 13వ సినిమాను 'VT13' వర్కింగ్ టైటిల్ తో ప్రకటించిన విషయం తెలిసిందే.
వరుణ్ తేజ్ (Varun Tej) ఇటీవలే తన 13వ సినిమాను 'VT13' వర్కింగ్ టైటిల్ తో ప్రకటించిన విషయం తెలిసిందే.

మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) ప్రస్తుతం తన తర్వాతి చిత్రాలను వరుసగా అనౌన్స్ చేస్తూ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాడు. ఈ క్రమంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగబాబు సమర్పణలో SVCC పతాకంపై బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

కాగా, వరుణ్‌ తేజ్ కి ఈ ఏడాది ‘గని’ (Gahni Movie) సినిమాతో అంతగా శుభారంభం దక్కకపోయినా.. ‘ఎఫ్‌3’తో మళ్లీ హిట్‌ ట్రాక్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం ఈ మెగా హీరో రెండు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ చిత్రం ఒకటి. 

ఇటీవలే ప్రవీణ్‌ సత్తారు (Pravenn Sattaru) దర్శకత్వం వహించిన ‘ది ఘోస్ట్‌’ (The Ghost) విడుదలై బాక్సాఫీస్‌ దగ్గర ఫెయిల్యూర్‌గా మిగిలింది. దీంతో వరుణ్‌తో ఈ సారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించాలని కసితో ఉన్నాడు ప్రవీణ్ సత్తారు.

'VT12' వర్కింగ్ టైటిల్ తో ఈ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే, ఈ సినిమా షూటింగ్ తాజాగా లండన్‌లో ప్రారంభమయింది. వరుణ్ తేజ్ ఈ మూవీ షూటింగ్ కోసం సిద్ధమవుతుండగా.. 'ది గేమ్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ బిగిన్స్' అంటూ ఓ చిన్న వీడియో ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దీంతో ఆ వీడియో రిలీజ్ అయిన కొద్ది సేపటికే వైరల్‌గా మారింది. కాగా, ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇంటర్నేషనల్ గుఢాచారి పాత్రలో కనిపిస్తారని టాక్ నడుస్తోంది.  

ఇదిలా ఉంటే.. వరుణ్ తేజ్ (Varun Tej) ఇటీవలే తన 13వ సినిమాను 'VT13' వర్కింగ్ టైటిల్ తో ప్రకటించిన విషయం తెలిసిందే. ఏయిర్‌ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

Read More: 'ఆకాశంలో జరిగే యుద్ధాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి'.. వరుణ్ తేజ్ (Varun Tej13) కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!