రాజమండ్రిలో వాలిపోయిన రామ్ చరణ్ (Ram Charan).. RC15 సినిమా షూటింగ్ కోసమేనా?

Updated on Oct 13, 2022 12:49 PM IST
ఈ సినిమా (RC15) షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది.
ఈ సినిమా (RC15) షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది.

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా (RC15) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా.. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

ఈ మూవీలో చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. విలన్ గా నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య నటిస్తున్న ఈ మూవీ లో అంజలి, జయరామ్, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అయితే, 'ఆర్ఆర్ఆర్'  (RRR) తరువాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో 'RC15'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక, ఇప్పటికే #RC15 మూవీ లో 1200 ఫైటర్స్ తో రామ్ చరణ్ (Ram Charan) పాల్గొనే యాక్షన్ సీన్.. రామ్ చరణ్, కియారా అద్వానీలతో (Kiara Advani) పాటు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్ లు పాల్గొనే సాంగ్ హైలైట్ కానున్నాయని సమాచారం. మరోవైపు ఈ మూవీ హైదరాబాద్‌, పూణె, రాజమండ్రి, అమృత్ సర్ షెడ్యూల్స్ పూర్తయ్యాయి.  

ఇదిలా ఉంటే..శంకర్ 'ఇండియన్2' (Indian 2) సినిమాను టేకప్ చేయడంతో.. చరణ్ సినిమా ఆలస్యమవుతుందనుకున్నారు. 'ఇండియన్ 2', 'RC15' సినిమాలను సమాంతరంగా చిత్రీకరించబోతున్నట్లు చెప్పారు శంకర్. కానీ తన ఫోకస్ మొత్తం 'ఇండియన్2' సినిమాపైనే పెట్టినట్లు వార్తలొచ్చాయి. దీంతో ఆ వార్తలన్నిటికీ చెక్ పెడుతూ తాజగా ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా (RC15) షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అక్కడ చరణ్ ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ను ఖరారు చేయలేదు. కానీ, టైటిల్ పవర్ ఫుల్ గా ఉండేలా చూస్తున్నారట. ఇప్పటికే టైటిల్ విషయంలో ఒక క్లారిటీకి వచ్చేశారనీ, దీపావళి రోజున టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 

Read More: 'ఆర్ఆర్ఆర్' (RRR) ఖాతాలో మరో మైలురాయి.. కశ్మీర్ (Kashmir) థియేటర్లలో ప్రదర్శితమవుతున్న తొలి సినిమాగా రికార్డు !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!