వెకేషన్ తర్వాత ఎయిర్ పోర్టులో భార్య ఉపాసనతో (Upasana) దర్శనమిచ్చిన రామ్ చరణ్ (Ram Charan).. ఫొటోలు వైరల్!

Published on Sep 21, 2022 03:58 PM IST

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్ర‌స్తుతం స్టార్ డైరెక్టర్ శంక‌ర్ (Director Shankar) దర్శ‌క‌త్వంలో 'ఆర్‌సీ 15' (RC15) లో న‌టిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం షూటింగ్ దాదాపు చివరి దశకు కూడా చేరుకుంటుంది. 

ఇదిలా ఉంటే.. డైరెక్టర్ శంకర్ ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ హీరోగా 'ఇండియన్ 2' (Indian 2) సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. శంకర్ ప్రస్తుతం 'ఇండియన్ 2' షూటింగ్ కు వెళ్లగా హీరో రామ్ చరణ్ కి కొంచెం ఖాళీ దొరికింది. దీంతో ఫ్యామిలీ తో ఈ హ్యాపీ టైం ని అయితే తాను ఎంజాయ్ చేసేందుకు చరణ్ విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. 
 
ఈ కమ్రంలో తాజాగా రామ్ చరణ్ (Ram Charan) తాను ముగించుకొచ్చిన చిన్న వెకేషన్ అనంతరం తన భార్య ఉపాసనతో కలిసి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించడం జరిగింది. దీంతో ఈ స్టార్ జంట ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి వైరల్ గా మారాయి. ఈ ఫొటోలలో రామ్ చరణ్ వెంట తన భార్య నడుస్తుండగా... ఆయన తన కుక్కపిల్లను ఎత్తుకొని నడుచుకుంటూ వస్తున్నారు. 

కాగా, రామ్ చరణ్ (Ram Charan), ఉపాస‌న (Upasana) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట, ఆ తర్వాత ఆదర్శ దంపతులుగా అనేకసార్లు కితాబునందుకున్నారు. రామ్, ఉపాస‌న‌ల మూడు ముళ్ల బంధానికి ప‌దేళ్లు పూర్త‌యింది. వీరి ప్రేమ ఎంద‌రికో  ఆదర్శం. ఈ జంట ఒక‌రిని ఒక‌రు గౌర‌వించుకుంటూ.. ఎంతో అన్యోన్యంగా ఉంటారు.

Read More: 150కి పైగా వృద్ధాశ్రమాలకు మద్దతునిస్తున్న ఉపాస‌న‌ (Ram Charan Wife)