రవితేజ (Raviteja) లేటెస్ట్ సినిమా నుంచి 'ధమాకా మాస్ క్రాకర్' (Dhamaka Mass Cracker) పేరుతో మాస్ టీజర్ రిలీజ్!

Updated on Oct 21, 2022 11:41 AM IST
తాజాగా 'ధమాకా మాస్ క్రాకర్' (Dhamaka Mass Cracker) అనే పేరుతో సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్.
తాజాగా 'ధమాకా మాస్ క్రాకర్' (Dhamaka Mass Cracker) అనే పేరుతో సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్.

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) హీరోగా, శ్రీలీల (Sree Leela) హీరోయిన్ గా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ధమాకా' (Dhamaka). ఈ సినిమాకు ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు. బీమ్స్‌ సిసిరిలియో సంగీతాన్ని అందిస్తుండగా… కార్తీక్‌ ఘట్టమనేని కెమెరామెన్‌ గా వ్యవహరించనున్నారు. యాక్షన్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

ప్రస్తుతం రవితేజ ఒక భారీ హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. చాలా కాలం తర్వాత మాస్‌రాజ ‘క్రాక్‌’తో గ్రాండ్‌ కంబ్యాక్ ఇచ్చాడు. అయితే అదే జోష్‌ను తన తదుపరి సినిమాల్లో కంటిన్యూ చేయలేకపోయాడు. ఈ ఏడాది రిలీజైన ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్‌ డ్యూటీ’లు వరుసగా ఫ్లాప్‌ అవడంతో తీవ్రంగా నిరాశపడ్డాడు. ప్రస్తుతం ఈయన ఆశలన్నీ ‘ధమాకా’ (Dhamaka) సినిమా పైనే ఉన్నాయి. 

‘ధమాకా’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన 'జింతాతా..' పాట బాగా పాపులర్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా 'ధమాకా మాస్ క్రాకర్' (Dhamaka Mass Cracker) అనే పేరుతో సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. టీజర్ చూస్తుంటే.. మళ్ళీ రవితేజ కెరీర్ లో సాలిడ్ కం బ్యాక్ గా నిలిచేలా కనిపిస్తోంది. తన మార్క్ మాస్ డైలాగ్స్, ఫైట్స్ తో సాలిడ్ గా కనిపిస్తుండగా ఈ టీజర్ లో తన కామెడీ టైమింగ్ కూడా మళ్ళీ చాన్నాళ్ళకి మంచి ఎంటర్టైనింగ్ గా కనిపిస్తోంది.

'ధమాకా' పేరుకు తగ్గట్టే టీజర్ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉంది. మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) మరోసారి తన మాస్ రూపం చూపించబోతున్నట్టు తెలుస్తుంది. "మీలో నేను విలన్ చూస్తే మీరు నాలోని హీరోని చూస్తారు" అని ఓ మాస్ ఫైట్ తో టీజర్ మొదలుపెట్టారు. కొట్టేటప్పుడు నేను శాడిస్ట్ ని అని రవితేజ తన యాక్షన్ చూపించాడు. ఇక శ్రీలీలతో (Sree Leela) కలిసి చేసే రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

ఈ చిత్రంలో రవితేజ (Raviteja) రెండు విభిన్న గెటప్స్‌లో ఒకటి క్లాస్‌, మరొకటి మాస్‌ గెటప్‌లో కనిపిస్తున్నాడు. భీమ్స్ సిసిరోలియలో నేపథ్య సంగీతం గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఇక, మలయాళ సీనియర్ హీరో జయరాం ఇందులో విలన్ గా నటించినట్టు తెలుస్తోంది. టీజర్ చివర్లో మరో విలన్ రవితేజకి గన్ చూపిస్తే రవితేజ వెనుక చాలా మంది బాడీగార్డులు వచ్చి నిల్చుంటారు. 'అటు నుంచి ఒక్క బుల్లెట్ వస్తే ఇటు నుంచి దీపావళే' అనే డైలాగ్ తో అదరగొట్టాడు రవితేజ. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 23న రిలీజ్‌ (Dhamaka Release date) చేయనున్నట్లు టీజర్‌లో ప్రకటించారు.

Read More: Raviteja: రవితేజ 'ధమాకా' (Dhamaka) మూవీ నుంచి 'మాస్ రాజా' (Mass Raja) లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!