షూటింగ్ పూర్తి చేసుకున్న రవితేజ (Raviteja) 'ధమాకా'మూవీ (Dhamaka).. దీపావళికి రిలీజ్?
మాస్ మహారాజ రవితేజ (Mass Maharaj Raviteja) చాలా కాలం తర్వాత ‘క్రాక్’తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. కరోనా సమయంలో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్ళను రాబట్టి బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. ఇక అదే స్పీడ్‌లో ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాలను 5నెలల వ్యవధిలోనే విడుదల చేశాడు.
అయితే, ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయాయి. అయినా అదే ఉత్సాహంతో ఈ ఏడాదిలోనే మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి ఆయన రెడీ అవుతున్నాడు.
రవితేజ హీరోగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థల పై తెరకెక్కుతున్న తాజా సినిమా 'ధమాకా' (Dhamaka). రవితేజకు జోడీగా 'పెళ్లి సందD' భామ శ్రీలీల (Sree Leela) హీరోయిన్‌గా నటిస్తున్నారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్‌లు, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా మరో అప్‌డేట్‌ను ప్రకటించారు.
'ధమాకా' (Dhamaka Movie) మూవీ మేకర్స్ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసినట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. వీడియోలో షూటింగ్ పూర్తైన సందర్భంగా పటాకులు పేలుస్తూ సంబురాలు చేసుకున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ రానున్నట్లు వెల్లడించారు.
'ధమాకా' (Dhamaka Movie) మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇక, ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క పోస్టర్స్, 'జింతాక' అనే పల్లవితో సాగే మాస్ సాంగ్ అందరినీ ఆకట్టుకుని సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచాయి. దీపావళికి ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. రవితేజ గత సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు.