Ramarao on duty: రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' నుంచి ‘నా పేరు సీసా..’ ఐటమ్ సాంగ్ రిలీజ్!

Updated on Jul 02, 2022 08:24 PM IST
‘రామారావు ఆన్‌ డ్యూటీ’ మూవీ పోస్టర్స్ (Ramarao on duty Movie Posters)
‘రామారావు ఆన్‌ డ్యూటీ’ మూవీ పోస్టర్స్ (Ramarao on duty Movie Posters)

Ramarao on duty: టాలీవుడ్ మాస్‌ మహారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం వ‌రుసగా సినిమాలను చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు. అందులో ఒక సినిమా నూతన దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ అండ్ సోషల్ సబ్జెక్ట్ 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ చిత్రంలో ర‌వితేజ డిప్యూటీ క‌లెక్ట‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. శ్రీ ల‌క్ష్మివెంక‌టేశ్వ‌రా సినిమాస్, ఆర్‌టి టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ల‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి రవితేజ కూడా ఒక భాగస్వామిగా ఉన్నాడు. దివ్యాన్ష కౌశిక్, రజీషా విజయన్ కథానాయికలుగా నటించారు. శ్యామ్ సీ ఎస్ సంగీతాన్ని సమకూర్చాడు. 

‘రామారావు ఆన్‌ డ్యూటీ’ (Ramarao on duty) చిత్రం నుంచి మేకర్స్ ఒకో అప్డేట్ ని రిలీజ్ చేస్తుండగా ఇప్పుడు ఈ సినిమా నుంచి ఐటెం నెంబర్ “నా పేరు సీసా” అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. రెండు రోజులుగా ఈ పాట ప్రొమోతో నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా లిరికల్‌ సాంగ్‌ను శనివారం విడుదల చేశారు. ‘‘నా పేరు సీసా (సీకాకులం సారంగి)నా పేరు సీసాఒకరికి నే తేనె సీసాఒకరికి నే కల్లు సీసాఒకరికినే  మసాలా సీసాఇంకొకరికి రసాల సీసా అందరికీ అందిస్తాను స్వర్గానికి వీసా’’ అంటూ సాగే ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. శ్రేయా ఘోషల్‌ (shreya ghoshal)ఆలపించారు. 

‘రామారావు ఆన్‌ డ్యూటీ’ (Ramarao on duty) ఈ పాటతో బాలీవుడ్ హాట్ భామ అన్వేషి జైన్‌ టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. శ్రేయా ఘోషల్ గొంతుతో మరింత గ’మ్మత్తు’ గా అనిపించిన ఈ పాటలో అన్వేషి జైన్ గ్లామ్ షో తో హాట్ కూడా కనిపించింది. ఇంకా ఈ సాంగ్ లో రవితేజ లుక్స్ తో అయితే మరింత యంగ్ గా కనిపించడం ఆసక్తిగా ఉంది. ఓవరాల్ గా అయితే ఈ సాంగ్ మంచి క్లీన్ అండ్ హాట్ గా ఉందని చెప్పవచ్చు.  

అన్వేషి జైన్ (Anveshi Jain) డాన్స్‌తోపాటు గ్లామర్‌ పాటకు ప్రత్యేక ఆకర్షణ కాగా, ఆమె వేసిన స్టెప్పులు ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా ఉన్నాయనీ, థియేటర్‌ దద్దరిల్లిపోవడం ఖాయమంటూ  నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన ‘బుల్ బుల్ తరంగ్‌’, ‘సొట్ట బుగ్గ‌ల’ సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుండి విశేష స్పంద‌న వ‌చ్చింది. చాలా కాలం త‌ర్వాత సీనియ‌ర్ న‌టుడు వేణు తోట్టెంపూడి ఈ చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ జూలై 29న థియేటర్స్ లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

ఇటీవ‌లే ‘ఖిలాడీ’తో అభిమానుల‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచిన మాస్‌రాజ ఈ సారి ‘రామారావు ఆన్ డ్యూటీ’తో ఎలాగైనా మంచి హిట్టు సాధించాల‌ని క‌సితో ఉన్నాడు. కెరీర్‌లో ఎప్పుడు లేనంత స్పీడ్‌గా షూటింగ్‌ల‌ను పూర్తి చేస్తూ.. ఏడాదికి రెండు సినిమాల‌ను విడుద‌ల‌ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు రవితేజ (Raviteja) చేతిలో నాలుగు సినిమాలున్నాయి. 

Read More: Ravi Teja: 'టైగర్ నాగేశ్వర్ రావు' సినిమా షూటింగ్‌లో గాయపడ్డ మాస్ మహారాజ రవితేజ..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!