Ginna First Look: పవర్ ఫుల్ పాత్రలో మంచు విష్ణు (Manchu Vishnu).. జిన్నా ఫస్ట్ లుక్ రిలీజ్!

Updated on Jul 11, 2022 06:06 PM IST
'జిన్నా' మూవీ పోస్టర్, మంచు విష్ణు (Ginna Poster, Manchu Vishnu)
'జిన్నా' మూవీ పోస్టర్, మంచు విష్ణు (Ginna Poster, Manchu Vishnu)

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ప్రెసిడెంట్, హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం 'జిన్నా' (Ginna). ఈషన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ కథానాయికలుగా నటిస్తున్నారు. 

AVA ఎంటర్‌టైన్‌మెంట్ & 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సునీల్ (Actor Suneel) కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్  ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

'జిన్నా' సినిమా (Ginna) ప‌ల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో ముగ్గురు స్నేహితుల కథ‌తో రూపొందుతోంది. కాగా, ఈ సినిమాకు 'జిన్నా' అనే టైటిల్‌ పెడుతున్న విషయాన్ని కూడా గతంలో వెరైటీగా ప్రకటించారు. ఆ వీడియోను మంచు విష్ణు సోషల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు. కథ రాసిన కోన వెంకట్‌, డైరెక్టర్‌ సూర్య, కెమెరా మ్యాన్‌ చోటా కే నాయుడు, మ్యూజిక్‌ అందించిన అనూప్‌ రూబెన్స్ (Anup Rubens) లతో విష్ణు ఫన్నీగా మాట్లాడుతూ ఆ సినిమా టైటిల్‌ను రివీల్‌ చేశారు. అప్పటినుంచీ ఈ సినిమా పై క్యూరియాసిటీని పెంచుతూనే ఉంది. 

'జిన్నా' (Ginna)సినిమాను రకరకాలుగా ప్రమోట్ చేస్తోంది చిత్ర యూనిట్. అందులో భాగంగా చిత్రబృందం తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా రిలీజ్ చేసింది. ఈ ఫస్ట్ లుక్ లో విష్ణు స్టైల్‌గా కనిపించాడు. పైగా మంచు విష్ణు (Manchu Vishnu) జిన్నా లుక్‌ని రివీల్ చేసేందుకు ‘జిన్నా టీమ్’ చేసిన స్పెషల్ వీడియో కూడా చాలా బాగుంది. 

ఈ ఫస్ట్ లుక్‌లో (Ginna Firs Look) కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌, అలాగే చోటా కే నాయుడు కనిపించడం విశేషం. ఈ ఫస్ట్ లుక్‌ వీడియోలో హీరో అని పిలిస్తే పలకని మంచు విష్ణు.. జిన్నా అనగానే మాత్రం చటుక్కున లేచి నిలబడి దేనికైనా రెడీ అంటుండటం విశేషం. పూర్తిగా వైట్ అండ్ వైట్ లో విష్ణు అద్భుతంగా కనిపిస్తున్నాడు. మొత్తానికి ఈ సినిమా గ్లింప్స్ సినిమాపై హైప్‌ని పెంచింది. 

Read More: 'మా' ప్రెసిడెంట్ అయితే, సినిమాలలో నటించకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా ? : మంచు విష్ణు (Manchu Vishnu)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!