Manchu Vishnu: స‌న్నీ లియోన్ కు ముద్దు పెట్టేసిన మంచు విష్ణు!

Updated on May 31, 2022 07:49 PM IST
సన్నీ లియోన్, మంచు విష్ణు (Sunny Leone, Manchu Vishnu)
సన్నీ లియోన్, మంచు విష్ణు (Sunny Leone, Manchu Vishnu)

Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు, హీరో మంచు విష్ణు జోరు ఇటీవ‌లి కాలంలో మాములుగా లేదు. సోష‌ల్ మీడియాలో ఆయ‌న చేసే సంద‌డి పీక్స్‌లో ఉంటుంది. చాలా గ్యాప్ తర్వాత మంచు విష్ణు పక్కా ప్రణాళికతో 'గాలి నాగేశ్వర రావు' అనే సినిమా చేస్తున్నారు. షూటింగ్ దశ నుంచే ఈ చిత్రానికి మంచి ప్రచారం కల్పిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్ ని సోషల్ మీడియాలో తరచుగా పోస్ట్ చేస్తున్నారు. 

కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విష్ణు సరసన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్, శృంగార తార సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఇషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కోన వెంకట్ ఈ చిత్రానికి రచయిత. కాగా, హాట్ బ్యూటీ సన్నీ లియోన్ ఈ చిత్రంలో నటిస్తున్న‌ట్లు వార్త‌ రాగానే ఈ మూవీకి మంచి క్రేజ్ వచ్చింది.  

తాజాగా షూటింగ్ లొకేషన్ లో మంచు విష్ణు (Manchu Vishnu).. ఈ సినిమా హీరోయిన్లయిన‌ పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ తో క‌లిసి లంచ్ డేట్ కి వెళ్లారు. రెస్టారెంట్ లో మంచు విష్ణు తన వారితో సరదాగా గడిపాడు. విష్ణు ఏకంగా సన్నీలియోన్ కి ముద్దులు ఇస్తూ సెల్ఫీకి ఫోజులు ఇచ్చాడు. విష్ణు తనని కిస్ చేస్తుంటే సన్నీలియోన్ విక్టరీ సింబల్ చూపిస్తోంది. ఇక పాయల్ రాజ్ పుత్ సెల్ఫీలు తీయడంలో బిజీగా ఉంది. కాగా, ఈ ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారింది. 

ఈ ఫొటోను చూసి నెటిజ‌న్లు అనేక ర‌కాలుగా స్పందిస్తున్నారు. మంచు విష్ణుకు రొమాన్స్ ఎక్కువైంద‌ని కొంద‌రు అంటుండ‌గా.. ప‌బ్లిక్ గా ఇలాంటి ప‌నులేంటి అని విమ‌ర్శిస్తున్నారు. గ‌తంలోనూ ఓ సారి ఈ సారి స‌న్నీ లియోన్ వీపు మీద ఆమ్లెట్ వేయాల‌ని చూసి నెటిజ‌న్ల‌చే విష్ణు విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు. అయితే ఆ సంఘ‌ట‌న ఇంకా మ‌రిచిపోక ముందే మ‌ళ్లీ ఆమెతో అలాగే ప్ర‌వ‌ర్తించాడు. దీంతో విష్ణును మ‌ళ్లీ నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఖాళీ దొరికిన‌ప్పుడ‌ల్లా మంచు విష్ణు, స‌న్నీ లియోన్‌, పాయ‌ల్ రాజ్‌పూత్ ముగ్గురూ స‌ర‌దాగా గ‌డుపుతూనే ఉన్నారు. ఈ మ‌ధ్యే వారు ఓ ఫ‌న్నీ సంఘ‌ట‌న‌లో పాలు పంచుకున్నారు. స‌న్నీ, పాయ‌ల్ ఇద్ద‌రిలో ఎవ‌రు అందంగా ఉంటార‌ని అడ‌గ్గా.. విష్ణు ఒక్కోసారి ఒక‌రి పేరు చెప్పారు. త‌రువాత ఎవ‌రూ కాదు.. అన్నారు. దీంతో వారిద్ద‌రూ విష్ణును చిత‌క‌బాదారు. 

అయితే, దాదాపు ఏడేళ్ల క్రితం సన్నీలియోన్ (Sunny Leone).. విష్ణు సోదరుడు మంచు మనోజ్ నటించిన కరెంట్ తీగ చిత్రంలో మెరిసింది. ఇన్నేళ్ల తర్వాత ఈ హాట్ బ్యూటీ మళ్ళీ ఇప్పుడు మనోజ్ అన్న విష్ణుతో రొమాన్స్ చేస్తోంది. అయితే సినిమా సంగ‌తేమో కానీ స‌న్నీలియోన్, మంచు విష్ణు ఆఫ్ స్క్రీన్‌లో తెగ సంద‌డి చేస్తూ అందుకు సంబంధించిన వీడియోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. సన్నీలియోన్ (Sunny Leone) ఈ చిత్రంలో రేణుక పాత్రలో ఎన్నారై యువతిగా నటిస్తోంది. విదేశాల నుంచి విలేజ్ కు తిరిగి వచ్చిన పాత్రలో సన్నీలియోన్ ఎంటర్టైన్ చేయబోతోందట. ఎన్నారై యువతిగా వచ్చిన సన్నీలియోన్ ఆ గ్రామంపై ఎలాంటి ప్రభావం చూపింది అనేది ఆసక్తిగా ఉండబోతోంది అని అంటున్నారు చిత్ర యూనిట్. కాగా, మంచు విష్ణు చివరిగా ‘మోసగాళ్లు’ అనే చిత్రంలో నటించారు. ఆ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఇక దీని తర్వాత తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన ‘ఢీ’ సినిమాకు సీక్వెల్ ‘ఢీ అంటే ఢీ’ను ప్రారంభించాడు. కానీ ఆ సినిమా ఎందుకో ముందుకు వెళ్లలేదు. విష్ణు ప్రస్తుతం ఇషాన్ సూర్య దర్శకత్వంలో ‘గాలి నాగేశ్వరరావు’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!