'మా' ప్రెసిడెంట్ అయితే, సినిమాలలో నటించకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా ? : మంచు విష్ణు (Manchu Vishnu)

Updated on Jun 10, 2022 04:15 PM IST
మంచు విష్ణు (Manchu Vishnu) యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో 'ఓ మంచి సినిమా చేయాలని ఉందని' నటుడు సునీల్‌తో తన మనసులోని మాటను చెబుతాడు.
మంచు విష్ణు (Manchu Vishnu) యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో 'ఓ మంచి సినిమా చేయాలని ఉందని' నటుడు సునీల్‌తో తన మనసులోని మాటను చెబుతాడు.

Manchu Vishnu : మంచు విష్ణు.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా సుపరిచితుడు. 'విష్ణు' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన మంచు విష్ణు..ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా లాంటి హిట్ సినిమాలలో నటించాడు. 

కానీ గత కొంత కాలంగా ఈయన నటిస్తున్న సినిమాలన్నీ కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా పడుతున్నాయి. ఇటీవలే విష్ణు నటించిన భారీ బడ్జెట్ సినిమా 'మోసగాళ్లు' కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం రిలీజయ్యాకే, విష్ణు 'మా' అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 

ఇటీవలే మంచు విష్ణు (Manchu Vishnu) యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో 'ఓ మంచి సినిమా చేయాలని ఉందని' నటుడు సునీల్‌తో తన మనసులోని మాటను చెబుతాడు. దానికి ఆయన రచయిత కోన వెంకట్‌ని కలవమని అడుగుతాడు.

తర్వాత వెంటనే విష్ణు, కోన వెంకట్‌కు ఫోన్ చేస్తాడు. ఓ మంచి స్క్కిప్ట్ ఉంటే చెప్పమని అడుగుతాడు. దానికి ఆయన 'గీతాంజలి 2' కథ రెడీగా ఉందని.. మంచు లక్ష్మీ ఒప్పుకుంటే ఆమెతో సినిమా చేస్తానని అంటాడు. 

కొత్త కథతో ముందుకు వస్తున్న మంచు విష్ఱు

అప్పుడు, విష్ణు తన కోసమే ఓ సినిమా కథ కావాలంటాడు. దానికి కోన వెంకట్ 'ఏంటి..'మా' ప్రెసిడెంటుగా ఉంటూ కూడా, సినిమా చేస్తారా' అంటూ ఆశ్చర్యపోతాడు. అప్పుడు విష్ఱు కూడా ఆ ప్రశ్నకు తగ్గ జవాబే ఇస్తాడు. 'ఏంటి సార్! 'మా' ప్రెసిడెంటు అయినంత మాత్రాన.. సినిమాలో నటించకూడదని రాజ్యంగంలో రాసుందా' అంటూ సమాధానమిస్తాడు. తాను ఒక సినిమా చేస్తే, 100 మందికి పని దొరుకుతుందని అంటాడు. 

మంచు విష్ణు సినిమాకి డైరెక్టర్‌గా సూర్య !

దానికి కోన వెంకట్ కూడా అంగీకరిస్తాడు. ఓ మంచి కథ ఉందని చెబుతూ, స్టోరీని మొత్తం నేరేట్ చేస్తాడు. ఆ కథ విన్నాక, కెమెరామెన్ బాధ్యతలను చోటా కే నాయుడికి అప్పగిస్తే బాగుంటుందని వారు నిర్ణయిస్తారు. అలాగే సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్‌ను ఓకే చేస్తారు. దర్శకుడిగా మాత్రం మురుగుదాస్, శ్రీనువైట్ల వద్ద కో డైరెక్టరుగా పనిచేసిన సూర్యని ఎంపిక చేస్తారు. 

ఇంత హంగామా జరిగాక, సినిమా టైటిల్ మీదకు డిస్కషన్ మల్లుతుంది. అప్పుడు కోన వెంకట్ 'జిన్నా' అనే టైటిల్ ఈ సినిమాకి పెడితే బాగుంటుందని అంటాడు. అప్పుడు విష్ణు మాట్లాడుతూ 'అన్నా. మనమేమైనా పాకిస్తాన్ సినిమా తీస్తున్నామా' అంటూ ఆశ్చర్యపోతాడు. దానికి కోన వెంకట్ బదులిస్తూ 'ఈ కథలో హీరో పేరు గాలి నాగేశ్వరరావు. అతనికి ఆ పేరు నచ్చకపోవడం వల్లే, దానిని షార్ట్ చేసి 'జిన్నా'గా మారుస్తాడు' అనడంతో అందరూ నవ్వుతారు. అదే పేరును ఓకే చేస్తారు.

వెంటనే స్క్రీన్ పై జిన్నా టైటిల్ ప్రత్యక్షమవుతుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషలలో కూడా ఈ సినిమా తెరకెక్కుతుందని మనకు, అక్కడే హింట్ కూడా ఇచ్చేస్తారు.

మరి చూడాలి ! 'జిన్నా' అలియాస్ 'గాలి నాగేశ్వరరావు' పాత్రలో మంచు విష్ణు (Manchu Vishnu) ఎంతవరకు ఆకట్టుకుంటాడో !

Read More: విష్ణు మంచు (Vishnu Manchu) ‘గాలి నాగేశ్వరరావు’ సినిమాలో పాట పాడిన కూతుళ్లు అరియానా, వివియానా

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!