నాగార్జున హీరోగా నటిస్తున్న 'ది ఘోస్ట్' (The Ghost) ప్రమోషన్లు షురూ.. సెప్టెంబర్ 25న ప్రీరిలీజ్ ఈవెంట్!

Updated on Sep 22, 2022 01:57 PM IST
'ది ఘోస్ట్' (The Ghost) ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 25న కర్నూల్ లో ప్లాన్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు.
'ది ఘోస్ట్' (The Ghost) ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 25న కర్నూల్ లో ప్లాన్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు.

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Nagarjuna)కుర్ర హీరోలతో పోటీపడుతూ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవలే 'బ్రహ్మాస్త్ర' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు నాగ్. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం 'ది ఘోస్ట్'. టాలెంటెడ్ డైరెక్టర్ ప్ర‌వీణ్ స‌త్తారు (Praveen Sattaru) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా.. అందాల భామ సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.

'ది ఘోస్ట్' సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే జోరందుకున్నాయి. నాగార్జున-సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) ల బ్యూటీఫుల్ కెమిస్ట్రీతో యువతను ఆకట్టుకున్న ఫస్ట్ సింగిల్ వేగంతో మ్యూజిక్ ప్రమోషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 25న కర్నూల్ లో ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు. సాయంత్రం 6 గంట‌ల నుంచి ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది.

కాగా, 'ది ఘోస్ట్' (The Ghost) చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పీ, నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్ మెంట్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హై ఆక్టేన్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైనర్ గా వ‌స్తున్న ఈ మూవీలో బాలీవుడ్ న‌టి గుల్ ప‌నాగ్‌, అనిఖా సురేంద్ర కీ రోల్స్‌ పోషిస్తున్నారు. 

'ది ఘోస్ట్‌'లో నాగార్జున (Nagarjuna) ఇంటర్ పోల్ ఆఫీస‌ర్ విక్ర‌మ్ పాత్ర‌లో న‌టిస్తుండగా.. మార్క్ కే రాబిన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే, కర్నూల్ లో జరిగే ఘోస్ట్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేయనున్నట్లు సమాచారం అందుతోంది. చిరుతో పాటు దర్శకధీరుడు రాజమౌళి కూడా హాజరుకానున్నారని టాక్ వినిపిస్తోంది.

Read More: The Ghost: నాగార్జున (Nagarjuna) సినిమా 'ది ఘోస్ట్' కోసం రంగంలోకి దిగిన‌ 'పుష్ప' హిందీ డిస్ట్రిబ్యూటర్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!