The Ghost: 'ది ఘోస్ట్' సినిమాలో నాగార్జున (Nagarjuna), సోనాల్ ల‌వ్ సాంగ్ ప్రోమో రిలీజ్

Updated on Sep 15, 2022 06:21 PM IST
నాగార్జున (Nagarjuna) న‌టించిన 'ది ఘోస్ట్' నుంచి మొద‌టి పాట‌ను సెప్టెంబ‌ర్ 16 తేద‌న సాయంత్రం 4.05 రిలీజ్ చేయ‌నున్నారు.
నాగార్జున (Nagarjuna) న‌టించిన 'ది ఘోస్ట్' నుంచి మొద‌టి పాట‌ను సెప్టెంబ‌ర్ 16 తేద‌న సాయంత్రం 4.05 రిలీజ్ చేయ‌నున్నారు.

The Ghost: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున (Nagarjuna) న‌టించిన 'ది ఘోస్ట్' చిత్రం  అక్టోబ‌ర్ 5న రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డ‌టంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ల‌ను కూడా పెంచారు. ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్‌ను రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 'ది ఘోస్ట్' నుంచి మొద‌టి పాట‌ను సెప్టెంబ‌ర్ 16 తేదీన సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయ‌నున్నారు. ఇప్పటికే   "వేగం" అనే టైటిల్ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నాగార్జున‌కు జోడిగా సోనాల్ చౌహన్ కథానాయికగా న‌టించారు.

'గరుడ వేగ' దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ది ఘోస్ట్' (The Ghost). ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది. అయితే ఈ సినిమా వాయిదా ప‌డుతుందనే వార్త‌లు సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

అక్టోబ‌ర్ 5 నే రిలీజ్

చిరంజీవి న‌టించిన 'గాడ్‌ఫాద‌ర్' సినిమా కూడా అక్టోబ‌ర్ 5వ తేదీనే రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో 'ది ఘోస్ట్' సినిమా విడుద‌ల అవుతుందా? లేక చిత్రాన్ని వాయిదా వేస్తారా అనే టాక్ వినిపించింది. అయితే 'ది ఘోస్ట్' సినిమా విడుద‌ల‌పై వ‌స్తున్న వార్త‌లు న‌మ్మ‌వ‌ద్ద‌ని.. అనుకున్న తేదీకే రిలీజ్ చేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. 

'ది ఘోస్ట్' నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, టీజర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. "వేగం" అనే పల్లవితో సాగే ఫస్ట్ రొమాంటిక్ సాంగ్ ని సెప్టెంబర్ 16న విడుదల చేయ‌నున్నారు. ఈ పాట‌కు భరత్ సౌరభ్ సంగీతం అందించారు. ఈ సినిమాకు మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూర్చారు.

Read More: The Ghost : నాగార్జున (Nagarjuna) 'ది ఘోస్ట్' రిలీజ్ ద‌స‌రా రోజే... ఫేక్ వార్త‌లు న‌మ్మ‌వ‌ద్ద‌న్న మేక‌ర్స్

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!