The Ghost : నాగార్జున (Nagarjuna) 'ది ఘోస్ట్' రిలీజ్ ద‌స‌రా రోజే... ఫేక్ వార్త‌లు న‌మ్మ‌వ‌ద్ద‌న్న మేక‌ర్స్

Updated on Sep 14, 2022 11:05 AM IST
The Ghost: 'ది ఘోస్ట్'  చిత్రంలో పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌‌గా నాగార్జున (Nagarjuna) నటిస్తున్నారు.
The Ghost: 'ది ఘోస్ట్' చిత్రంలో పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌‌గా నాగార్జున (Nagarjuna) నటిస్తున్నారు.

The Ghost: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున (Nagarjuna) న‌టించిన 'ది ఘోస్ట్' చిత్రం రిలీజ్ అక్టోబ‌ర్ 5న అని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా వాయిదా ప‌డుతుందనే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. చిరంజీవి న‌టించిన 'గాడ్‌ఫాద‌ర్' కూడా అక్టోబ‌ర్ 5 తేదీనే రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో 'ది ఘోస్ట్' సినిమా విడుద‌ల అవుతుందా.. లేక వాయిదా వేస్తారా అనే టాక్ వినిపించింది. 'ది ఘోస్ట్' సినిమాపై వ‌స్తున్న వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఏమందంటే..

ప‌క్కా రిలీజ్ చేస్తాం- చిత్ర యూనిట్

ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన 'ది ఘోస్ట్' సినిమా ద‌స‌రా పండుగ కానుక‌గా అక్టోబ‌ర్ 5 తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.  'ది ఘోస్ట్' ట్రైలర్‌ను మ‌హేష్ బాబు విడుద‌ల చేయ‌డం స‌ర్‌ప్రైజ్‌గా అనిపించింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ చిత్రంలో పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌‌గా నాగార్జున నటిస్తున్నారు.

'ది ఘోస్ట్' సినిమా అక్టోబ‌ర్ 5 తేదీనే విడుద‌ల చేస్తామ‌ని నిర్మాతలు వెల్ల‌డించారు. ఈ సినిమా రిలీజ్‌పై వ‌స్తున్న వార్త‌లు న‌మ్మ‌వ‌ద్ద‌ని తెలిపారు. ముందుగా ప్ర‌క‌టించిన తేదీకే నాగార్జున సినిమా రిలీజ్ కానుంద‌ని క్లారిటీ ఇచ్చారు. దీంతో నాగ్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. 

'ది ఘోస్ట్' (The Ghost) సినిమాలో సోనాల్‌ చౌహాన్‌ కథానాయికగా న‌టించారు. ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా నాగార్జున 'ది ఘోస్ట్' చిత్రంలో అద‌ర‌గొట్ట‌నున్నారు. ఓ త‌ల్లీ కూతుళ్ల‌ను కాపాడే ప్ర‌య‌త్నంలో నాగార్జున ఎదుర్కొన్న స‌వాళ్లు ఆస‌క్తిక‌రంగా క‌నిపించాయి. నాగార్జున్ ఫైట్స్ సినిమాకు హైలెట్ కానున్నాయి. సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా 'ది ఘోస్ట్' విడుద‌ల కానుంది. 

'ది ఘోస్ట్' సినిమాతో మ‌రోసారి నాగార్జున ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేయ‌నున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జ‌రుగుతున్నాయి. సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌ రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. 

Read More: 'లైగర్' థియేటర్లలో నాగార్జున (Nagarjuna) 'ది ఘోస్ట్' సినిమా ట్రైలర్ హంగామా..నాగ్ ఈజ్ బ్యాక్ అంటున్న అభిమానులు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!