యాక్షన్ థ్రిల్లర్ గా నాగార్జున (Akkineni Nagarjuna) ‘ది ఘోస్ట్‌’ (The Ghost).. అదరగొడుతున్న రిలీజ్ ట్రైలర్!

Updated on Oct 07, 2022 12:08 AM IST
'ది ఘోస్ట్' (The Ghost) సినిమా విడుదల తేదీ సమీపిస్తుండటంతో.. చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలలో జోరు పెంచింది.
'ది ఘోస్ట్' (The Ghost) సినిమా విడుదల తేదీ సమీపిస్తుండటంతో.. చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలలో జోరు పెంచింది.

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) హీరోగా తెరకెక్కిన తాజా సినిమా ‘ది ఘోస్ట్‌’ (The Ghost). ప్రవీణ్‌ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సోనాల్‌ చౌహాన్‌ కథానాయికగా నటిస్తుండగా.. అక్టోబ‌ర్ 5న గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ఇక, ఈ మూవీలో నాగార్జున ‘రా’ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. 

'ది ఘోస్ట్' (The Ghost) చిత్రానికి మార్క్ కే. రాబిన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పీ, నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ బ్యాన‌ర్ల‌పై సునీల్ నారంగ్‌, పీ.రామ్మోహ‌న్ రావు, శ‌ర‌త్ మ‌రార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరక్కిస్తున్నారు. ఈ చిత్రంలో గుల్ ప‌నాగ్‌, అనిఖా సురేంద్రన్, మనీష్ చౌదరి, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, బిలాల్ హుస్సేన్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. 

'ది ఘోస్ట్' (The Ghost) సినిమా విడుదల తేదీ సమీపిస్తుండటంతో.. చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలలో జోరు పెంచింది. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌, పాటలు విడుదల చేసిన చిత్ర యూనిట్.. తాజాగా ‘రిలీజ్‌ ట్రైలర్‌’ను విడుదల చేసింది. ఒక నిమిషం 26 సెకండ్ల నిడివిగల ఈ రిలీజ్‌ ట్రైలర్‌.. 'ఆ.. ఇంతకీ ఎవడాడు' అనే డైలాగ్‌తో ఆరంభమయింది.

'డబ్బు, సక్సెస్‌.. సంతోషం కంటే శత్రువులను ఎక్కువ సంపాదిస్తుంది' అనే డైలాగ్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. తన అక్క, ఆమె కూతురిని కాపాడడం కోసం హీరో నాగార్జున చేసే సాహసమే ఈ సినిమా అని రిలీజ్‌ ట్రైలర్‌ను చూస్తే ఇట్టే అర్ధమవుతోంది. నాగ్ ను 'ది ఘోస్ట్'గా (The Ghost Release Trailer) పరిచయం చేసే సీన్ ను ఈ ట్రైలర్ లో పొందుపరిచారు. ఫారెన్ లొకేషన్లలో చిత్రీకరించిన ఫైట్ సీక్వెన్స్ లను తాజా ట్రైలర్ లో చూడవచ్చు.

Read More: The Ghost: 'ది ఘోస్ట్' కోసం నాగార్జున (Nagarjuna) అంత రిస్క్ చేశారా!.. మేకింగ్ వీడియో అదుర్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!