The Ghost: 'ది ఘోస్ట్' ర‌న్ టైమ్ రిలీజ్.. త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ వినోదం అంటున్న నాగ్ (Nagarjuna)

Updated on Sep 27, 2022 06:42 PM IST
ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వ‌హించిన 'ది ఘోస్ట్' (The Ghost) సినిమా గంట 35 నిమిషాల నిడివితో థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శితం కానుంది. 
ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వ‌హించిన 'ది ఘోస్ట్' (The Ghost) సినిమా గంట 35 నిమిషాల నిడివితో థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శితం కానుంది. 

The Ghost: టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna) కొత్త సినిమా 'ది ఘోస్ట్' విడుద‌లకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5 న విడుద‌ల చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం 'ది ఘోస్ట్' సినిమా ర‌న్ టైమ్ గురించిన వివ‌రాల‌ను మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వ‌హించిన 'ది ఘోస్ట్' సినిమా గంట 35 నిమిషాల నిడివితో థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శితం కానుంది. 

ఓ త‌ల్లీ కూతుళ్ల‌ను కాపాడే ప్ర‌య‌త్నంలో నాగార్జున ఎదుర్కొనే స‌వాళ్లు ప్ర‌ధాన అంశంగా ఈ సినిమా క‌థ సాగ‌నుంది. నాగార్జున్ ఫైట్స్ సినిమాకు హైలెట్ కానున్నాయి. సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా 'ది ఘోస్ట్' విడుద‌ల కానుంది.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వ‌హించిన 'ది ఘోస్ట్' (The Ghost) సినిమా గంట 35 నిమిషాల నిడివితో థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శితం కానుంది. 

'ది ఘోస్ట్' (The Ghost) సినిమాను ద‌ర్శ‌కుడు ప్రవీణ్‌ సత్తారు తెర‌కెక్కించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌ రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి మార్క్ కే రాబిన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

నాగార్జున న‌ట‌నే హైలెట్‌!

నాగార్జున ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా 'ది ఘోస్ట్‌'లో క‌నిపించ‌నున్నారు. బాలీవుడ్ న‌టి గుల్ ప‌నాగ్‌, అనిఖా సురేంద్ర ఈ సినిమాలో ప్ర‌త్యేక పాత్ర‌ల‌లో న‌టించారు. నాగార్జున న‌టించిన 'వైల్డ్ డాగ్' స‌స్పెన్స్ థిల్ల‌ర్ జోన్‌లో ఇటీవ‌ల రిలీజ్ అయింది. కోవిడ్ కార‌ణంగా ఈ సినిమా అనుకున్నంత స‌క్సెస్ కాలేదు. కానీ ఆ సినిమాలో నాగార్జున న‌ట‌న‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది. 'ది ఘోస్ట్' సినిమాతో మ‌రోసారి నాగార్జున ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేయ‌నున్నారు. 

Read More: The Ghost: నాగార్జున (Nagarjuna) సినిమా 'ది ఘోస్ట్' కోసం రంగంలోకి దిగిన‌ 'పుష్ప' హిందీ డిస్ట్రిబ్యూటర్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!