నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో విడుదలైన అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) 'ది ఘోస్ట్' (The Ghost)..!
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) హీరోగా సోనాల్ చౌహన్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లింగ్ యక్షన్ మూవీ 'ది ఘోస్ట్' (The Ghost). ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌లపై సునీల్ నారంగ్, పుస్కురి రామ్‌మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అక్టోబర్ 5న విడుదలై ఓకే అనిపించుకుంది.
'ది ఘోస్ట్' (The Ghost) కథ, కథనం రొటీన్‌గా ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. పోటీగా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్‌ఫాదర్' వంటి సినిమా కూడా విడుదల కావడంతో 'ది ఘోస్ట్' చిత్రానికి ఒకింత కారణమనే చెప్పవచ్చు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపించారు. బాలీవుడ్ యాక్టర్ మనీష్ చౌదరి ఈ చిత్రంలో విలన్‌గా నటించారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్, శ్రీకాంత్ అయ్యంగార్, రవివర్మ ముఖ్యమైన పాత్రల్లో నటించారు.
ఇదిలా ఉంటే.. 'ది ఘోస్ట్' సినిమా తాజాగా ఓటీటీ వేదికగా (The Ghost OTT Release) విడుదలయ్యేందుకు సిద్ధమయ్యింది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నేటి నుంచి (నవంబర్ 2) ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్.
ఈ మేరకు ‘ది ఘోస్ట్’ సినిమా ట్రైలర్ షేర్ చేస్తూ. ‘భయపెట్టే కథల్లో ఉండే ఘోస్ట్ కాదు. నవంబర్ 2న నెట్ ఫ్లిక్స్ లోకి వస్తుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక థియేటర్లలో మిశ్రమ స్పందన సొంతం చేసుకున్న ఈ మూవీ ఓటీటీ ఏ స్థాయి వ్యూస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా తర్వాత నాగార్జునకు సరైన విజయం లేదు. గతేడాది ‘వైల్డ్ డాగ్’ (Wild Dog) సినిమాతో పలకరించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు సరైన వసూళ్లు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతికి నాగార్జున తన తనయుడు ‘బంగార్రాజు’ సినిమాతో పలకరించారు. ఈ సినిమా సక్సెస్‌తో నాగార్జున బ్యాక్ బౌన్స్ అయ్యారనే చెప్పాలి. కానీ ‘ది ఘోస్ట్’ సినిమా మరోసారి నాగార్జునకు నిరాశనే మిగిల్చింది.