"అమ్మాయిలతో రొమాన్స్.. గన్నులతో ఫైరింగ్ రెండూ ఇష్టమే".. 'ది ఘోస్ట్' (TheGhost) ప్రమోషన్లలో నాగార్జున వ్యాఖ్యలు

Updated on Oct 06, 2022 11:56 PM IST
'ది ఘోస్ట్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (The Ghost Pre Release Event)లో నాగార్జునకు ఆసక్తికర ప్రశ్న ఎదురయ్యింది.
'ది ఘోస్ట్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (The Ghost Pre Release Event)లో నాగార్జునకు ఆసక్తికర ప్రశ్న ఎదురయ్యింది.

టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna) ప్రస్తుతం 'ది ఘోస్ట్' (The Ghost) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే కర్నూలులో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమాలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది.

కాగా, నాగార్జున తన సినీ కెరీర్ ప్రారంభించినప్పటి నుంచీ రొమాంటిక్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఆయన సినిమాల్లో రొమాన్స్ సన్నివేశాలు అధికంగా ఉంటాయి. ఇక ఆయనలాగా ఎవరూ చేయలేరన్న విధంగా రొమాన్స్ పండిస్తాడు. ఈ విషయంలో ఇప్పటికీ తన కొడుకులతో పోటీ పడుతున్నాడు. ఈ వయసులో కూడా వరుస హిట్స్ అందుకుంటున్నాడు నాగార్జున. 

ఇదిలా ఉంటే.. 'ది ఘోస్ట్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (The Ghost Pre Release Event)లో నాగార్జునకు ఆసక్తికర ప్రశ్న ఎదురయ్యింది. ఆయన రొమాంటిక్ ఇమేజ్ గురించి ప్రశ్నించారు ఓ మీడియా ప్రతినిధి. దానికి కింగ్ నాగార్జున నవ్వుతూ ఫన్నీఆన్సర్ కూడా ఇచ్చారు. 

ఈ సందర్భంగా ఓ విలేకరి ప్రశ్నిస్తూ మీరు మీ సినిమాలలో ఎక్కువగా రొమాన్స్ చేయడానికి ఇష్టపడతారా లేదా గన్నులతో ఫైరింగ్ చేయడానికి ఇష్టపడతారా అంటూ వింత ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు నాగార్జున (Nagarjuna) సమాధానం చెబుతూ తనకు సినిమాలలో ఒకవైపు అమ్మాయిలతో రొమాన్స్ చేయడం ఇష్టం.. అలాగే మరోవైపు గన్నులతో ఫైరింగ్ చేయడం కూడా ఇష్టమే అంటూ సమాధానం చెప్పాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఫన్నీ వాతావరణం నెలకొంది. ఇక, నాగార్జున చెప్పిన ఈ సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇలా ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు నాగార్జునను (Nagarjuna) అనేక ప్రశ్నలు అడిగారు. రకరకాల ప్రశ్నలు అడగ్గా.. వాటికి ఓపికగా సమాధానం చెప్పారు కింగ్ నాగార్జున. ఇక 'ది ఘోస్ట్' సినిమా రిలీజ్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు.. ఈ మూవీలో నాగార్జున ఇంటర్ పోల్ ఆఫీసర్ గా చాలా కాలం తరువాత డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించారు.

Read More: యాక్షన్ థ్రిల్లర్ గా నాగార్జున (Akkineni Nagarjuna) ‘ది ఘోస్ట్‌’ (The Ghost).. అదరగొడుతున్న రిలీజ్ ట్రైలర్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!