The Ghost: 'ది ఘోస్ట్' నుంచి సాంగ్ రిలీజ్ చేయ‌నున్న మేక‌ర్స్.. నాగార్జున (Nagarjuna)తో సోనాల్ స్టెప్పులు

Updated on Sep 14, 2022 07:37 PM IST
 The Ghost: 'ది ఘోస్ట్' నుంచి మొద‌టి పాట‌ను సెప్టెంబ‌ర్ 16న రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సినిమాలో నాగార్జున‌ (Nagarjuna)కు జోడిగా సోనాల్ చౌహన్ న‌టించారు. 
The Ghost: 'ది ఘోస్ట్' నుంచి మొద‌టి పాట‌ను సెప్టెంబ‌ర్ 16న రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సినిమాలో నాగార్జున‌ (Nagarjuna)కు జోడిగా సోనాల్ చౌహన్ న‌టించారు. 

The Ghost: టాలీవుడ్ స్టార్ హీరో  అక్కినేని నాగార్జున (Nagarjuna) న‌టించిన 'ది ఘోస్ట్' చిత్రం రిలీజ్ అక్టోబ‌ర్ 5న అని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డ‌టంతో 'ది ఘోస్ట్' మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ల‌ను పెంచారు. ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్‌ను రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 'ది ఘోస్ట్' నుంచి మొద‌టి పాట‌ను సెప్టెంబ‌ర్ 16న రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సినిమాలో నాగార్జున‌కు జోడిగా సోనాల్ చౌహన్ న‌టించారు. 

ద‌స‌రాకు రిలీజ్

'గరుడ వేగా' దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ 'ది ఘోస్ట్'  (The Ghost). ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది. అయితే ఈ సినిమా వాయిదా ప‌డుతుందనే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

చిరంజీవి న‌టించిన 'గాడ్‌ఫాద‌ర్' కూడా అక్టోబ‌ర్ 5 తేదీనే రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో 'ది ఘోస్ట్' సినిమా విడుద‌ల అవుతుందా.. లేక వాయిదా వేస్తారా అనే టాక్ వినిపించింది. 'ది ఘోస్ట్' సినిమా విడుద‌ల‌పై వ‌స్తున్న వార్త‌లు న‌మ్మ‌వ‌ద్ద‌ని.. అనుకున్న తేదీకే రిలీజ్ చేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. 

'ది ఘోస్ట్' నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, టీజర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. వేగం అనే పల్లవితో సాగె ఫస్ట్ రొమాంటిక్ సాంగ్ ని సెప్టెంబర్ 16న విడుదల చేయ‌నున్నారు. ఈ పాట‌కు భరత్ సౌరభ్ సంగీతం అందించారు. ఈ సినిమాకు మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూర్చారు.

Read More: The Ghost : నాగార్జున (Nagarjuna) 'ది ఘోస్ట్' రిలీజ్ ద‌స‌రా రోజే... ఫేక్ వార్త‌లు న‌మ్మ‌వ‌ద్ద‌న్న మేక‌ర్స్

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!