అల్లు అర్హ, అయాన్ లతో కలిసి అల్లు అర్జున్ (Allu Arjun) దీపావళి సంబరాలు మామూలుగా లేవుగా.. వీడియో వైరల్!

Published on Oct 26, 2022 06:26 PM IST

Allu Arjun: అక్టోబర్ 24న దేశవ్యాప్తంగా.. అలాగే ప్రపంచ నలుమూలలా ఉన్న తెలుగువారు దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ బాణాసంచా కాలుస్తూ పండగని ఎంజాయ్ చేశారు. చాలామంది నటీనటులు.. దీపావళికి సంబంధించిన ఫొటోలు, వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

ఈ క్రమంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన ఇద్దరు పిల్లలు అర్హ, అయాన్ లతో కలిసి టపాసులు కాలుస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బన్నీ పిల్లలిద్దరూ ట్రెడిషనల్ వేర్ లో ముద్దులొలికిస్తూ మెరిసిపోయారు. 

ఆయన దగ్గరుండి మరీ అర్హ, అయాన్ లతో కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్డులు కాల్పించి వారిని ఆనందాన్ని రెట్టింపు చేస్తూ సందడిగా గడిపారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో పలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది.

మరోవైపు దీపావళి సందర్భంగా పిల్లలతో ఎంజాయ్ చేయడం కంటే ముందు.. మెగా కజిన్స్ (Mega Family) అందరితో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.

Read More: అల్లు అర్జున్ (Allu Arjun), రామ్ చరణ్ (Ram Charan) కాంబోలో సినిమా ప్లానింగ్ చేస్తున్న అగ్ర నిర్మాత ఎవరంటే..!