ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) భార్య స్నేహా రెడ్డి బర్త్ డే సందర్భంగా బన్నీ స్పెషల్ విషెస్..!

Updated on Sep 29, 2022 03:28 PM IST
హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని అందం కలిగిన స్నేహారెడ్డి (Sneha Reddy) అప్పుడప్పడూ ఫోటో షూట్స్ తోనూ తెగ సందడి చేస్తారు. 
హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని అందం కలిగిన స్నేహారెడ్డి (Sneha Reddy) అప్పుడప్పడూ ఫోటో షూట్స్ తోనూ తెగ సందడి చేస్తారు. 

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అందాల శ్రీమతి స్నేహారెడ్డి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన తన ప్రియమైన భార్య (Sneha Reddy) బర్త్ డే వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. అల్లు అర్హ, అయాన్ సమక్షంలో ఆమెతో కేక్ కట్ చేయించారు. ఈ క్రమంలో ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేస్తూ హ్యాపీ బర్త్ డే క్యూటీ అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. 

ఇక, అల్లు అర్జున్ అభిమానులు సైతం స్నేహా రెడ్డి (Sneha Reddy) కి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేస్తున్నారు. కాగా, కొన్ని సంవత్సరాలపాటు ప్రేమలో ఉన్న బన్నీ-స్నేహా 2011లో వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. 2014లో అబ్బాయి అయాన్, 2016లో అమ్మాయి అర్హ జన్మించారు.

కాగా అల్లు అర్జున్ కూతురు అర్హ 'శాకుంతలం' (Shakuntalam) మూవీతో వెండితెర ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ మైథలాజికల్ మూవీలో సమంత హీరోయిన్. ఈ చిత్రంలో అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు.

ఇరు కుటుంబాల సమక్షంలో, బంధువులు, స్నేహితులు, వేలమంది అభిమానుల దీవెనలతో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. అప్పటి నుండి ఇప్పటివరకు ఎంతో అన్యోన్యంగా ఉంటారు ఈ జంట. కాగా, టాలీవుడ్ స్టార్ హీరో భార్య అయిన స్నేహారెడ్డి (Sneha Reddy) ఆ గ్లామర్ మెయింటైన్ చేస్తారు. హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని అందం కలిగిన స్నేహారెడ్డి అప్పుడప్పడూ ఫోటో షూట్స్ తోనూ తెగ సందడి చేస్తారు. 

ఇక, అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. 'పుష్ప 2' లో రష్మిక మందన్న (Rashmika Mandanna)తో రొమాన్స్ చేయనున్నాడు బన్నీ. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం అక్టోబర్ మొదటి వారం నుండి షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2021లో విడుదలైన పుష్ప చిత్రానికి కొనసాగింపుగా 'పుష్ప 2' (Pushpa 2) తెరకెక్కుతోంది.

Read More: Allu Sneha Reddy: బ్లాక్ డ్రెస్‌ & సూపర్ స్టైలిష్ లుక్‌ .. అల్లు అర్జున్ వైఫ్ స్నేహా రెడ్డి ఫోటో వైరల్ ..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!