Allu Arjun : అల్లు అర్జున్ తన వైఫ్ స్నేహతో కలిసి ప్లాన్ చేసిన.. రొమాంటిక్ డేట్ నైట్ విశేషాలు మీకోసం
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం తన భార్య స్నేహ.. అలాగే పిల్లలు అర్హ, అయాన్‌లతో విహారయాత్ర నిమిత్తం లండన్‌లో ఉన్నారు. బన్నీ, స్నేహల జంట సోషల్ మీడియాతో ఎంత యాక్టివ్‌గా ఉంటారో మనకు తెలిసిందే. వీరు ఎప్పుడూ ఆహ్లాదకరమైన వాతావరణంలో తమ టూర్లను ప్లాన్ చేస్తుంటారు. వేసవి సెలవుల కోసం వివిధ ప్రదేశాలను ఎంచుకుంటూ ఉంటారు.
ఇటీవలే లండన్‌లోని ఓ ప్రముఖ పార్కులో అల్లు అర్జున్ (Allu Arjun) కుటుంబం సందడి చేసింది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్ పాయింట్ వద్ద బన్నీ, తన పిల్లలతో సరదాగా గడుపుతున్న ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అల్లు అర్జున్, స్నేహల జంట ఇటీవలే లండన్‌లో ఓ స్పెషల్ డేట్ నైట్‌ని ఆస్వాదించారు. తమ రొమాంటిక్ ముచ్చట్లను ఇన్ స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
అల్లు స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తమ టూర్ వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు."ఒక టేబుల్‌పై రుచికరమైన ఆహారం .. మరో వైపు అందమైన భర్త.. ఇంకేం కావాలి" అంటూ ఇటీవలే సోషల్ మీడియాలో ఆమె ఓ పోస్టు పెట్టారు.
కొన్ని రోజుల క్రితం, అల్లు అర్జున్ తన కొడుకు అయాన్.. అలాగే కూతురు అర్హాతో కలిసి తీయించుకున్న ఒక చిత్రాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రాలలో వారు నిజంగానే క్యూట్ లుక్స్‌తో ఉన్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Arjun) తన తదుపరి చిత్రం "పుష్ప: ది రూల్" కోసం సమయాన్నంతా వెచ్చిస్తున్నాడు. 2021 యాక్షన్ డ్రామా, పుష్ప: ది రైజ్ చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ చిత్రం గురించి ఇటీవలి కాలంలో ఎన్నో వార్తలు హల్చల్ చేశాయి. ముఖ్యంగా యశ్ నటించిన KGF: చాప్టర్ 2 ఊహించని విజయం సాధించాక, దర్శకుడు సుకుమార్ సీక్వెల్ విషయంలో.. అలాగే స్క్రిప్ట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు తెలుస్తోంది.
అలాగే దర్శకుడు కొరటాల శివతో కూడా అల్లు అర్జున్ (Allu Arjun) ఓ పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేశారు. చాలా రోజుల క్రితమే ఈ సినిమా ఎనౌన్స్ చేసినా, ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు.