శ్రీ విష్ణు హీరోగా నటించిన 'అల్లూరి' (Alluri) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసిన అల్లు అర్జున్ (Allu Arjun)..!

Published on Sep 20, 2022 12:18 PM IST

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా ప్రదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'అల్లూరి' (Alluri). బెక్కెం వేణుగోపాల్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. 

'అల్లూరి' (Alluri Movie) సినిమాలో మొదటిసారి ఫుల్ మాస్ యాక్షన్ సినిమాతో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రాబోతున్నాడు శ్రీ విష్ణు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  

ఈ సందర్భంగా అల్లు అర్జున్ (Allu Arjun) మాట్లాడుతూ.. తనకు ఇష్టమైన వ్యక్తి శ్రీవిష్ణు అని.. "ఆయన అన్ని సినిమాలు ఫాలో అవుతుంటానని అన్నారు. 'ప్రేమ ఇష్క్‌ కాదల్‌' సినిమాలో ముగ్గురు హీరోలలో శ్రీవిష్ణు ఒకరని.. ఆ మూవీలో చాలా బాగా చేయడంతో అప్పటి నుంచి ఆయనపై ప్రత్యేకమైన ఇష్టం ఏర్పడిందని చెప్పారు. ఈ ఫంక్షన్ కి వచ్చి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చిన మీ అందరికి థ్యాంక్యూ. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు. నాకు ఆర్మీ ఉంది. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అభిమానులకి థ్యాంక్యూ" అని పేర్కొన్నారు. 

'అల్లూరి' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో శ్రీ విష్ణు (Sree Vishnu) బన్నీ గురించి మాట్లాడుతూ.. "రానున్న నాలుగేళ్లల్లో ఇండస్ట్రీ మారబోతోంది. కంటెంట్‌ ఉన్న సినిమాలకే ఆదరణ ఉంటుంది. అలాంటి వాటినే ఎంపిక చేసుకోండి. లేదంటే ఖాళీగా ఉండండి అని ఆయన అప్పుడు చెప్పిన మాటలను ఇప్పటికీ పాటిస్తున్నా. నేనేంటో నిరూపించుకుని ఆయనను కలవాలనుకున్నా. 'సన్నాఫ్‌ సత్యమూర్తి'లో చిన్న పాత్ర అవకాశం ఇచ్చారు. పట్టరాని ఆనందంలోనే చిత్రీకరణలో పాల్గొన్నా" అని అన్నారు.

Read More: Alluri Movie Teaser: పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో యంగ్ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu).. టీజర్ అదిరిపోయింది!