Allu Sneha Reddy: బ్లాక్ డ్రెస్‌ & సూపర్ స్టైలిష్ లుక్‌ .. అల్లు అర్జున్ వైఫ్ స్నేహా రెడ్డి ఫోటో వైరల్ ..!

Updated on Aug 08, 2022 03:51 PM IST
స్నేహారెడ్డి షేర్‌ చేసిన ఫోటో నెట్టింట వైరల్‌ అవుతోంది. బ్లాక్ డ్రెస్‌లో సూపర్‌ స్టైలిష్‌ లుక్‌లో (Sneha Reddy) ఫోటోకి ఫోజిచ్చింది.
స్నేహారెడ్డి షేర్‌ చేసిన ఫోటో నెట్టింట వైరల్‌ అవుతోంది. బ్లాక్ డ్రెస్‌లో సూపర్‌ స్టైలిష్‌ లుక్‌లో (Sneha Reddy) ఫోటోకి ఫోజిచ్చింది.

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Icon Star Allu Arjun) సతీమణి అల్లు స్నేహారెడ్డి (Allu Sneha Reddy) కి సోషల్‌మీడియాలో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. స్టార్‌ హీరోల సతీమణులలో స్నేహారెడ్డికి ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె 8.3 మిలియన్‌ ఫాలోవర్స్‌తో సోషల్‌ మీడియాలో దుమ్మురేపుతోంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో బన్నీకి సంబంధించిన అప్‌డేట్స్‌తో పాటు తమ పిల్లలకు సంబంధించిన క్యూట్‌ వీడియోలను షేర్‌ చేస్తుంటుంది.  

తాజాగా స్నేహారెడ్డి ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. బ్లాక్ కలర్‌ డ్రెస్‌లో సూపర్‌ స్టైలిష్‌ లుక్‌లో (Sneha Reddy Stylish Looks) కనిపిస్తుందామె. ఇక, ఈ ఫోటోపై నిహారిక, సుస్మిత కొణిదెల సహా, పలువురు నెటిజన్లు సైతం 'సూపర్‌ హాట్‌' అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

అలాగే ఆమె హీరోయిన్‌కు ఏ మాత్రం తీసుపోకుండా ఉన్నారంటూ. పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం స్నేహారెడ్డి షేర్‌ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

కాగా స్నేహారెడ్డి (Allu Sneha Reddy) తాజాగా షేర్ చేసిన ఈ ఫొటోల్లో,  బ్లాక్ కలర్‌ డ్రెస్‌లో సూపర్‌ స్టైలిష్‌ లుక్‌లో కనిపించిందామె. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ జుకల్కర్‌ ఈ దుస్తులను డిజైన్‌ చేశారు. సమంత డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ (Pteetham Jukalker).. స్నేహారెడ్డికి సైతం  దుస్తులను డిజైన్ చేస్తుంటాడు. అతను డిజైన్ చేసిన దుస్తుల్లోనే స్నేహారెడ్డి తాజాగా మెరిసింది.

దీంతో స్నేహా రెడ్డి లుక్స్‌ను పొగుడుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. 'ఇద్దరు పిల్లలు పుట్టినా.. ఇలా సూపర్ ఫిట్‌నెస్ మెయింటైన్ చేయడం నిజంగానే ఆశ్చర్యంగా' ఉందంటూ మరికొందరు నెటిజన్లు స్నేహారెడ్డి పై ప్రశంసలు కూడా కురిపించారు.  

కాగా, టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్‌ది (Allu Arjun) ప్రత్యేక స్థానం. ప్రస్తుతం బన్నీ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి చేరింది. తను నటించిన సినిమాలకు నేషనల్ వైడ్‌గా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక అల్లు అర్జున్ మ్యానరిజం, డ్యాన్స్ స్టెప్పులు ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అయ్యాయి. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంటున్నాయి.

ఇక క్రికెటర్ల నుండి హాలీవుడ్ స్టార్ల వరకు..  ఇలా ఒక్కరని కాదు.. అనేకమంది బన్నీని ఫాలో అవుతున్నారు. 'పుష్ప రాజ్'  పేరుతో ఆయనకు దక్కిన పాపులారిటీ మామూలుగా లేదు. అలాంటి బన్నీ వైఫ్ అంటే.. మామూలుగా ఉండకూడదు కదా. అందుకే స్నేహారెడ్డి సైతం సోషల్ మీడియాలో కొత్త కొత్త పోస్టులతో, లుక్స్‌తో దుమ్ములేపుతోంది. 

Read More: Allu Arjun : అల్లు అర్జున్ తన వైఫ్ స్నేహతో కలిసి ప్లాన్ చేసిన.. రొమాంటిక్ డేట్ నైట్ విశేషాలు మీకోసం

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!