'సర్కారువారి పాట'లోని 'కళావతి' (Kalavathi) పాటకు కీర్తి సురేష్ (Keerthy Suresh) స్టెప్పులు మామూలుగా లేవుగా..!

Published on Oct 08, 2022 07:24 PM IST

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మహానటిగా (Mahanati Movie) పేరు సంపాదించుకుంది కీర్తి సురేష్ (Keerthy Suresh). అందులో కీర్తి సురేష్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగా మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాలో ఈమె నటన చూసి స్టార్ హీరోలు సైతం ఫిదా అయ్యారు. 

ఇటీవల మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' (Sarkaru Vaari Paata) సినిమాలో కీర్తి సురేష్ కళావతి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రత్యేకమైన గుర్తింపు లభించడంతో పాటు కీర్తి సురేష్ కామెడీ టైమింగ్ కు ప్రేక్షకులు సైతం ఫిదా అవుతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా కీర్తి సురేష్‌ (Keerthy suresh) ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌లో పాల్గొంది. ఇందులో ఆమె రెడ్‌ జాకెట్‌, రెడ్‌ ప్యాంట్‌ ధరించింది. ఈ ఈవెంట్ లో భాగంగా కీర్తిసురేష్‌ స్టేజ్‌పై రచ్చ చేసింది. 'డీజే టిల్లు', 'సర్కారు వారి పాట' సినిమాల్లోని పాటలకి స్టెప్పులేసింది. స్టేజిపై అందరితో కలిసి డాన్సు చేసి హోరెత్తిస్తూ ఈవెంట్‌కి ఊపు తీసుకొచ్చింది. దీంతో ప్రస్తుతం కీర్తి సురేష్‌ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

Read More: షాపింగ్ మాల్ (CMR Shopping Mall) ప్రారంభోత్సవంలో కీర్తి సురేష్ (Keerthy Suresh).. మహానటి సందడి మామూలుగా లేదుగా