టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న నిఖిల్‌ (Nikhil) కార్తికేయ2 సినిమా

Updated on Aug 16, 2022 10:34 PM IST
నిఖిల్‌ (Nikhil) కార్తికేయ2 సినిమా కలెక్షన్లు బాలీవుడ్‌లో కూడా బాగానే ఉన్నాయని టాక్
నిఖిల్‌ (Nikhil) కార్తికేయ2 సినిమా కలెక్షన్లు బాలీవుడ్‌లో కూడా బాగానే ఉన్నాయని టాక్

నిఖిల్ సిద్దార్ధ్‌ (Nikhil) హీరోగా నటించిన కొత్త సినిమా కార్తికేయ2. మైథలాజికల్ అడ్వంచరస్ సస్పెన్స్‌ థ్రిల్లర్‌‌గా తెరకెక్కిన కార్తికేయ2 సినిమా హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈనెల 13న విడుదలైన కార్తికేయ 2 మంచి కలెక్షన్లతో దూసుకెళుతోంది.

బాలీవుడ్‌లో లిమిటెడ్ స్క్రీన్స్‌లో రిలీజ్ అయిన కార్తికేయ2 సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా 300 శాతం ఎక్కువగా కలెక్ట్‌ చేస్తూ లాల్ సింగ్ చడ్డా, రక్షాబంధన్ సినిమాలు కూడా అందుకోలేని ఫీట్‌ సాధించింది. కార్తికేయ2 ట్రెండ్‌పై సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

నిఖిల్‌ (Nikhil) కార్తికేయ2 సినిమా కలెక్షన్లు బాలీవుడ్‌లో కూడా బాగానే ఉన్నాయని టాక్

యూఎస్‌లోనూ మంచి కలెక్షన్లు..

శనివారం కార్తికేయ2 సినిమా రూ.7 లక్షలు వసూలు చేయగా.. ఆదివారం రూ.28 లక్షలు కలెక్ట్‌ చేసిందని తరణ్‌ తెలిపారు. బాలీవుడ్‌లో రీసెంట్‌గా రిలీజైన ఆమిర్‌‌ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన రక్షాబంధన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయితే వీటన్నింటినీ వెనక్కునెట్టి కార్తికేయ2 బాలీవుడ్‌లో సత్తా చాటుతుండడం విశేషం. అటు యూఎస్‌లో కూడా కార్తికేయ2 సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. మొదటిరోజే ఈ సినిమాకు సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చాయి.

కాగా, చందూ మొండేటి దర్వకత్వం వహించిన కార్తికేయ2 సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషించారు. నిఖిల్‌ (Nikhil) హీరోగా గతంలో వచ్చిన సూపర్‌‌హిట్‌ సినిమా కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా కార్తికేయ2 సినిమా తెరకెక్కింది.  

Read More : నిఖిల్‌ (Nikhil) హీరోగా నటించిన కార్తికేయ2 సినిమా నైజాం కలెక్షన్లు ఎంతంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!