Karthikeya 2: కార్తికేయ 2 మొద‌టి రోజు క‌లెక్ష‌న్ అన్ని కోట్లా?. నిఖిల్(Nikhil Siddharth)పై ప్ర‌శంస‌లు

Updated on Aug 14, 2022 01:16 PM IST
పాన్ ఇండియా సినిమాగా నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) న‌టించిన 'కార్తికేయ 2' ఇండియాతో పాటు అమెరికాలోనూ క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది.
పాన్ ఇండియా సినిమాగా నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) న‌టించిన 'కార్తికేయ 2' ఇండియాతో పాటు అమెరికాలోనూ క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది.

Karthikeya 2: టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) న‌టించిన 'కార్తికేయ 2' బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. ద‌ర్శ‌కుడు చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ఐదు భాష‌ల్లో ఆగ‌స్టు 13న రిలీజ్ అయింది. విడుద‌ల‌కు ముందే 'కార్తికేయ 2' సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. స‌ముద్రంలో కృష్ణుడుకి సంబంధించిన ద్వార‌కా న‌గ‌ర‌ ర‌హ‌స్యాల క‌థ ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు.

'కార్తికేయ 2' ను ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కులు
ఎన్నో వాయిదాల త‌ర్వాత రిలీజ్ అయిన 'కార్తికేయ 2' థియేట‌ర్ల‌ను దద్ద‌రిల్లిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా ఇండియాతో పాటు అమెరికాలోనూ క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. 'కార్తికేయ 2'ను ముందుగా జూలై 22 తేదీన రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ కొన్ని కార‌ణాల‌తో విడుదల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు రిలీజ్ అయిన 'కార్తికేయ 2' క‌లెక్ష‌న్ల ప‌రంగా దూసుకెళుతుంది. 

పాన్ ఇండియా సినిమాగా నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) న‌టించిన 'కార్తికేయ 2' ఇండియాతో పాటు అమెరికాలోనూ క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది.

'కార్తికేయ' సీక్వెల్‌గా 'కార్తికేయ 2' (Karthikeya 2) ను చిత్రీక‌రించారు. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా ఈ సినిమా క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. వీరిద్ద‌రి న‌ట‌న‌కు ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుతున్నాయి. మైథ‌లాజిక‌ల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఈ చిత్రంలో ధన్వంతరి పాత్రలో బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌ అనుపమ్‌ఖేర్ నటించి మెప్పించారు. ఈ సినిమా మొద‌టి రోజు దాదాపు రూ. 17.25 కోట్లు రాబ‌ట్టి వండ‌ర్ క్రియేట్ చేసింది.

'కార్తికేయ 2' మొద‌టి రోజు క‌లెక్ష‌న్

  • నైజాం - రూ. 4 కోట్లు
  • సీడెడ్  - రూ. 2 కోట్లు
  • ఉత్తరాంధ్ర  - రూ. 2 కోట్లు
  • ఈస్ట్  - రూ. 0.75 కోట్లు
  • వెస్ట్  - రూ. 0.65కోట్లు
  • గుంటూరు  - రూ.1.0 కోట్లు
  • కృష్ణా  - రూ.1.0 కోట్లు
  • నెల్లూరు  - రూ.0.60 కోట్లు
  • ఏపీ + తెలంగాణ  - రూ.12 కోట్లు
  • రెస్ట్ ఆఫ్ ఇండియా  - రూ. 0.75 కోట్లు
  • ఓవర్సీస్  - రూ.1.50 కోట్లు
  • మిగిలిన వెర్షన్లు  - రూ. 3 కోట్లు
  • వరల్డ్ వైడ్  - రూ.17.25 కోట్లు

'కార్తికేయ 2' విడుద‌లైన ప్ర‌తీ చోటా హౌస్ ఫుల్ అవుతోంది. కొత్త క‌థ‌తో నిఖిల్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. ఇక 'కార్తికేయ 2' ముందు ముందు ఎలాంటి రికార్డుల‌ను తిర‌గ‌రాస్తుందో చూడాలి. 

Read More: 'కార్తికేయ 2' (Karthikeya 2) షూటింగ్ ఎలా సాగిందంటే.. మేకింగ్ వీడియోను రిలీజ్ చేసిన మేక‌ర్స్

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!