సినిమాకు మినిమం రూ.50 కోట్ల బడ్జెట్ పెట్టాల్సిందే!.. నిర్మాతలకు హీరో నిఖిల్ (Nikhil Siddhartha) కండీషన్?

Updated on Oct 21, 2022 01:02 PM IST
ఇకపై తాను నటించే సినిమాలను హిందీలో కూడా రిలీజ్ చేయాలని హీరో నిఖిల్ (Nikhil Siddhartha) భావిస్తున్నారట
ఇకపై తాను నటించే సినిమాలను హిందీలో కూడా రిలీజ్ చేయాలని హీరో నిఖిల్ (Nikhil Siddhartha) భావిస్తున్నారట

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ (Nikhil Siddhartha) వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో పాటు కథా బలం ఉన్న మూవీల్లో నటించడానికే నిఖిల్ ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే ఆయన కెరీర్‌లో హిట్ చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన ‘కార్తికేయ 2’ (Karthikeya 2) సినిమాతో మరో బ్లాక్ బస్టర్ మూవీని నిఖిల్ తన ఖాతాలో వేసుకున్నారు. 

‘కార్తికేయ’ చిత్రం తెలుగుతోపాటు హిందీలోనూ మంచి హిట్‌గా నిలిచింది. అంతేగాక ఉత్తరాదిన నిఖిల్‌కు సరికొత్త మార్కెట్‌ను క్రియేట్ చేసింది. దీంతో కెరీర్‌ను జాగ్రత్తగా మలచుకోవాలని నిఖిల్ భావిస్తున్నారు. ఇకపై తీయబోయే సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తదుపరి తాను చేయబోయే చిత్రాలన్నీ లావిష్‌గా ఉంటూ, నేషనల్ వైడ్‌గా జనాలను ఆకర్షించేలా ఉండాలని నిఖిల్ అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో తనతో సినిమాలు చేయడానికి అప్రోచ్ అవుతున్న నిర్మాతలకు నిఖిల్ ఒక కండీషన్ పెడుతున్నారట.

భారీ బడ్జెట్ చిత్రాలకే గ్రీన్ సిగ్నల్?

తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కే నిఖిల్ సినిమాలు మంచి కలెక్షన్లు సాధిస్తుంటాయి. అందుకే ఆయనకు మినిమం గ్యారెంటీ హీరో అనే పేరు ఉంది. కానీ ఇప్పుడు తాను నటించే సినిమాల బడ్జెట్ కనీసం రూ.50 కోట్లు ఉండాలని నిర్మాతల దగ్గర నిఖిల్ డిమాండ్ చేస్తున్నారని సమాచారం. టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్ ఆడియెన్స్‌ను రీచ్ అయ్యేలా భారీ బడ్జెట్ చిత్రాలే చేయాలని ఆయన నిర్ణయించుకున్నారని వినికిడి. సినిమా వర్కవుట్ అయితే యాభై కోట్ల పెట్టుబడి సులువుగా వెనక్కి వచ్చేస్తుందని నిఖిల్ భావిస్తున్నారట. ‘కార్తికేయ 2’తో నిఖిల్‌కు ఉత్తరాదిన క్రేజ్ పెరగడం, మినిమం గ్యారెంటీ హీరోగా నమ్మకం ఉండటంతో ఆయన సినిమాకు భారీ బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారట. అయితే, బడ్జెట్ ఒక్కటే ముఖ్యం కాదని.. మంచి కథ దొరికితేనే సినిమాకు కమిట్ అవ్వాలని నిఖిల్ భావిస్తున్నారట.      

హిందీ ఆడియెన్స్ కోసం మార్పులు! 

ఇకపోతే, ‘కార్తికేయ 2’ సినిమా తర్వాత తన తర్వాతి ప్రాజెక్టులపై నిఖిల్ దృష్టి పెట్టారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ‘18 పేజెస్’ మూవీని అక్టోబర్ లేదా నవంబర్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే, ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా కొన్ని మార్పులు చేయాలని చిత్ర బృందం భావిస్తోందట. ఈ మూవీని హిందీలోనూ పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలనుకుంటున్నారని సమాచారం. దీనిపై త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక, గ్యారీ బీహెచ్ డైరెక్షన్‌లో ‘స్పై’ అనే సినిమాలోనూ నిఖిల్ నటిస్తున్నారు. ‘18 పేజెస్’, ‘స్పై’ చిత్రాలు తెలుగుతోపాటు హిందీలోనూ హిట్టయితే నిఖిల్ ఇమేజ్ మరింతగా పెరుగుతుందనడంలో సందేహం లేదు. 

Read more: 'కార్తికేయ 3' (Karthikeya3) చేయకపోతే మా అమ్మ నన్ను వదలదు.. హీరో నిఖిల్ (Nikhil Siddhartha) ఆసక్తికర వ్యాఖ్యలు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!