కార్తికేయ 2 (Karthikeya 2) ట్విట్ట‌ర్ రివ్యూ - కృష్ణుడి ర‌హ‌స్యాల‌ను చేధించిన నిఖిల్ (Nikhil Siddhartha)! 

Updated on Aug 13, 2022 01:51 PM IST
నిఖిల్ (Nikhil Siddhartha) న‌టించిన 'కార్తికేయ 2' సినిమా చూసిన ప్ర‌తీ ఒక్క‌రు బొమ్మ అదుర్స్ అంటూ సోష‌ల్ మీడియాలో రిప్లై ఇస్తున్నారు. 
నిఖిల్ (Nikhil Siddhartha) న‌టించిన 'కార్తికేయ 2' సినిమా చూసిన ప్ర‌తీ ఒక్క‌రు బొమ్మ అదుర్స్ అంటూ సోష‌ల్ మీడియాలో రిప్లై ఇస్తున్నారు. 

Karthikeya 2: టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) న‌టించిన 'కార్తికేయ 2' ప్ర‌పంచ వ్యాప్తంగా ఐదు భాష‌ల్లో విడుదలైంది. ఎన్నో వాయిదాల త‌రువాత రిలీజ్ అయిన 'కార్తికేయ 2' సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు చందు మొండేటి అద్భుతంగా తెర‌కెక్కించారంటూ ప్రేక్ష‌కులు ప్ర‌శంసిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో న‌టించ‌డం విశేషం. 'కార్తికేయ 2' సినిమా చూసిన ప్ర‌తీ ఒక్క‌రు బొమ్మ అదుర్స్ అంటూ సోష‌ల్ మీడియాలో రిప్లై ఇస్తున్నారు. 

కొత్త క‌థ‌తో సాగిన 'కార్తికేయ 2'

'స‌ముద్రం దాచుకున్న అతి పెద్ద ర‌హ‌స్యం ఈ ద్వార‌కా న‌గ‌రం'.. అంటూ ఆ మహత్తర న‌గ‌ర ర‌హ‌స్యాల‌ను తెలిపే క‌థ‌గా 'కార్తికేయ 2' సినిమాను దర్శకులు తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో డాక్ట‌ర్ పాత్ర‌లో నిఖిల్ న‌టించారు. కృష్ణుడు నివ‌సించిన ద్వార‌క న‌గ‌ర ర‌హ‌స్యాల‌ను తెలుసుకునే క్ర‌మంలో.. నిఖిల్‌కు ఎన్నో స‌వాళ్లు ఎదుర‌వుతాయి. ఆ స‌వాళ్ల‌ను దాటి కథానాయకుడు ఎలా ముందుకు వెళ్లాడు? ఈ క్రమంలో ఆయనకు ఎటువంటి అనుభవాలు ఎదురవుతాయన్నదే  'కార్తికేయ 2' క‌థాంశం.

'కార్తికేయ' సినిమాకు సీక్వెల్‌గా  'కార్తికేయ 2' (Karthikeya 2) తెరకెక్కింది. చందూ మొండేటి  గతంలో దర్శకత్వం వహించిన 'కార్తికేయ' ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. నిఖిల్ హీరోగా న‌టించిన ఆ సినిమా సుబ్రహ్మణ్యస్వామి ఆలయ రహస్యాల చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు 'కార్తికేయ‌ 2' కూడా ద్వార‌కా న‌గ‌ర ర‌హ‌స్యాలను  తెలిపే చిత్రంగా విడుద‌ల అయింది.

'కార్తికేయ 2'ను ముందుగా జూలై 22 తేదీన రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ కొన్ని కార‌ణాల‌తో విడుదల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. బ‌డా హీరోలు త‌న సినిమాను అడ్డుకోవాల‌ని చూశార‌ని నిఖిల్ ఇటీవ‌లే చేసిన వ్యాఖ్య‌లు పెద్ద దుమార‌మే లేపాయి. ఈ సినిమాలో నిఖిల్‌కు జోడిగా అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) న‌టించారు.

 నిఖిల్ (Nikhil Siddhartha) న‌టించిన 'కార్తికేయ 2' సినిమా చూసిన ప్ర‌తీ ఒక్క‌రు బొమ్మ అదుర్స్ అంటూ సోష‌ల్ మీడియాలో రిప్లై ఇస్తున్నారు. 

నిఖిల్ న‌ట‌న బాగుంది - ప్రేక్ష‌కులు

ఎన్నో వాయిదాల త‌ర్వాత రిలీజ్ అయిన 'కార్తికేయ 2' బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. ఇండియాతో పాటు అమెరికాలోనూ క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. సినిమా చూసిన ప్రేక్ష‌కులు అద్భుత‌మైన సినిమా అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొత్త క‌థ‌తో నిఖిల్ వినోదం పంచారంటూ కామెంట్లు పెడుతున్నారు. 

కార్తికేయ 2 ఐదు భాష‌ల్లో విడుద‌ల‌

'కార్తికేయ 2' చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్లపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. 'కార్తికేయ 2' సినిమాకు కాల‌భైర‌వ సంగీతం అందించారు. ఈ చిత్రంలో శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ ముఖ్యపాత్రల్లో న‌టించారు.

Read More: 'కార్తికేయ 2' (Karthikeya 2) షూటింగ్ ఎలా సాగిందంటే.. మేకింగ్ వీడియోను రిలీజ్ చేసిన మేక‌ర్స్

 

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!