మిస్టరీ థ్రిల్లర్ లో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran).. భయపెడుతున్న 'బట్టర్‌ ఫ్లై' (Butterfly) ట్రైలర్!

Updated on Dec 13, 2022 09:37 PM IST
పవర్ ఫుల్ గా కట్ చేసిన 'బట్టర్‌ ఫ్లై' (Butterfly Trailer) ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
పవర్ ఫుల్ గా కట్ చేసిన 'బట్టర్‌ ఫ్లై' (Butterfly Trailer) ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

యూత్ లో గార్జియస్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కి మంచి క్రేజ్ ఉంది. ఈ బ్యూటీ లీడ్ రోల్ లో నటించిన తాజా చిత్రం 'బట్టర్‌ ఫ్లై' (Butterfly). ఈ చిత్రం సైకో థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ఘంట సతీశ్ బాబు దర్శకత్వం వహించగా.. రవి ప్రకాశ్ బోడపాటి, ప్రసాద్, ప్రమోద్ నిర్మించారు.   

తాజాగా ‘బట్టర్ ఫ్లై’ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫుల్ సస్పెన్స్ క్రియేట్‌ చేస్తూ కట్ చేసిన ఈ చిత్ర ట్రైలర్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతోంది. ఇక, ట్రైలర్ విషయానికి వస్తే.. ఓ నగరంలో సైకో వరుసగా చిన్నపిల్లలను కిడ్నాప్ చేస్తూ.. డబ్బు అందుకున్న అనంతరం చంపేస్తుంటాడు. ఈ ఆపరేషన్ కు అతను పెట్టుకున్న పేరే 'బట్టర్‌ ఫ్లై' (Butterfly). 

ఈ నేపథ్యంలో 'బట్టర్‌ ఫ్లై' (Butterfly Trailer) లో భాగంగా కథానాయిక అనుపమ అపార్టుమెంటులోని ఫ్లాట్ లో తన ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తూ ఉంటుంది. వారిని ఆ సైకో కిడ్నాప్ చేస్తాడు. ఆ సైకో బారి నుంచి తన పిల్లలను కాపాడుకోవడానికి ఆ తల్లి ఎంతగా తాపత్రయపడిందనేదే సినిమా కథ అనే విషయం ఈ ట్రైలర్ బట్టి చూస్తే అర్థమవుతోంది. 

కాగా, పవర్ ఫుల్ గా కట్ చేసిన 'బట్టర్‌ ఫ్లై' (Butterfly Trailer) ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ కి బాగా ప్లస్ అయినట్లు తెలుస్తోంది. ఇక, ఈ మిస్టరీ థ్రిల్లర్‌లో భూమిక చావ్లా, రావు రమేష్, నిహాల్ కోధాటి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు, ఇతర దక్షిణాది భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కాబోతోంది. డిసెంబర్ 29, 2022న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కాబోతోంది.

Read More: SS Rajamouli: 'కార్తికేయ 2' ప్రీమియర్స్ లో రాజమౌళి ఆశీర్వాదం తీసుకున్న అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!