Bimbisara Glimpse: ‘ఓ యుద్ధం మీద ప‌డితే ఎలా ఉంటుందో చూస్తారా’.. నందమూరి క‌ళ్యాణ్ రామ్‌ 'బింబిసార' గ్లింప్స్!

Updated on Jul 02, 2022 07:18 PM IST
నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyanram)
నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyanram)

Bimbisara Glimpse: హిట్లు, ఫ్లాప్‌ల‌తో సంబంధంలేకుండా వ‌రుస సినిమాల‌తో ఎంట‌ర్టైన్ చేస్తుంటాడు నంద‌మూరి వారి హీరో క‌ళ్యాణ్ రామ్‌. ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'బింబిసార'. మల్లిడి వశిష్ఠ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్‌టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై క‌ళ్యాణ్‌రామ్ స్వీయ నిర్మాణంలో ఈ హిస్టారికల్ మూవీ తెరకెక్కుతోంది. ఫాంటసీ యాక్షన్‌ ఫిలిం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 500వ శతాబ్దంలో మగధ దేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసార జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 

ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన పోస్ట‌ర్‌ల‌కు ప్రేక్ష‌కుల నుండి విశేష స్పంద‌న వ‌చ్చింది. త్వరలో ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర‌బృందం అప్‌డేట్‌ల‌ను మొద‌లు పెట్టింది. ఈ క్రమంలో ఈ నెల 4న ట్రైలర్‌ను (Bimbisara Trailer Release Date) విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీనికి సంబంధించిన చిన్నపాటి గ్లింప్స్ వీడియో ఒకటి విడుదల చేసింది. చిత్రంలో కళ్యాణ్‌ రామ్‌ రెండు విభిన్న కోణాల్లో సాగే పాత్రల్లో కనిపించారు. కేథరిన్‌ ట్రెసా, సంయుక్త మీనన్‌, వారినా హుస్సేన్‌లు కథానాయికలుగా నటించనున్నారు. ఎమ్‌.ఎమ్‌ కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించనున్నారు.

తాజాగా విడులైన బింబిసార గ్లింప్స్ లో.. ‘ఓ యుద్ధం మీద ప‌డితే ఎలా ఉంటుందో చూస్తారా’ అంటూ క‌ళ్యాణ్‌రామ్ (Nandamuri Kalyanram) డైలాగ్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. గ్లింప్స్‌లోని విజువ‌ల్స్, క‌ళ్యాణ్‌రామ్ లుక్స్ ట్రైల‌ర్‌పై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. కొన్ని షాట్స్ చూస్తే కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడని ఇట్టే అర్ధఅవుతోంది. కళ్యాణ్ కళ్లలో రాజు పౌరుషం, పొగరు రెండు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

బడ్జెట్ విషయంలో వెనకడుగు వేయకుండా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు కళ్యాణ్ రామ్. ‘గౌతమి పుత్ర శాతకర్ణి’, ‘జై సింహా’, ‘కంచె’ (Kanche Movie) సినిమాలకు సంగీతం అందించిన చిరంతన్ భట్ ‘బింబిసార’చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండటంతో అంచనాలు పెరిగాయి. చాలా కాలం త‌ర్వాత ‘118’తో తిరిగి హిట్ ట్రాక్‌లోకి వ‌చ్చాడు. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్‌గాను ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం ఈయ‌న చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘బింబిసార’ ఒక‌టి. మరి అందరి అంచనాలను ‘బింబిసార’ అందుకుంటూ ఏమేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.  

Read More: బింబిసార (Bimbisara) రాజుగా మ‌గ‌ధ రాజ్యాన్ని క‌ల్యాణ్ రామ్ ఏలుతాడా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!