రొమాంటిక్ గా అల్లు శిరీష్ (Allu Sirish) తాజా చిత్రం 'ఊర్వశివో రాక్షసివో'(Urvasivo Rakshasivo) టీజర్..

Updated on Sep 29, 2022 08:09 PM IST
'ఊర్వశివో రాక్షసివో' (Urvasivo Rakshasivo Teaser) టీజర్ మొత్తం ఆసక్తికరంగా సాగిపోవడమే గాక అన్ని సన్నివేశాలూ ఆకట్టుకునేలా ఉన్నాయి.
'ఊర్వశివో రాక్షసివో' (Urvasivo Rakshasivo Teaser) టీజర్ మొత్తం ఆసక్తికరంగా సాగిపోవడమే గాక అన్ని సన్నివేశాలూ ఆకట్టుకునేలా ఉన్నాయి.

అల్లు శిరీష్ (Allu Sirish) హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఊర్వశివో రాక్షసివో' (Urvasivo Rakshasivo). రాకేష్‌ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శిరీష్‌ సరసన అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది. కాగా, ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ సంస్థ రూపొందించింది. 

అంతకుముందు ఈ సినిమాకు 'ప్రేమ కాదంట' (Prema Kadanta Movie) అనే టైటిల్‌ ను అనౌన్స్ చేయగా.. ఇప్పుడు టైటిల్ మార్చారు. 'ఊర్వశివో రాక్షసివో' అనే టైటిల్ ను తాజాగా ప్రకటించారు.

కాసేపటి క్రితం 'ఊర్వశివో రాక్షసివో' (Urvasivo Rakshasivo) సినిమా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. టీజర్ మొత్తాన్ని లిప్ లాక్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ తో నింపేశారు. ఇందులో ‘‘కొన్ని విషయాలు మనం ఎంత ట్రై చేసినా జరగవు.. ఒక్కోసారి అనుకోకుండా జరిగిపోతాయి.. అలాంటప్పుడే అది మళ్లీ మళ్లీ జరిగితే బావుంటుందనిపిస్తుంటి’’ అంటూ అనూ ఇమ్యాన్యుయేల్‌కి (Anu Emmanuel) ముద్దులు మీద ముద్దులు పెడతూ కనిపించారు అల్లు శిరీష్‌.

'ఊర్వశివో రాక్షసివో' (Urvasivo Rakshasivo Teaser) టీజర్ మొత్తం ఆసక్తికరంగా సాగిపోవడమే గాక అన్ని సన్నివేశాలూ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక, ఈ టీజర్ చూస్తుంటే ఈ సినిమా యూత్‌పుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ అని అర్ధమవుతోంది. టీజర్ లోని కొన్ని డైలాగ్స్, అలానే కొన్ని సీన్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయని చెప్పవచ్చు.

‘నువ్వు మామూలోడివి కాదు రాజా.. ఇంట్లోనేమో బుద్దిమాన్‌.. బయటేమో శక్తిమాన్‌..’ అంటూ పోసాని కృష్ణమురళీ చెప్పిన డైలాగ్‌, ‘అల్లుడూ కొద్దిగా టఫ్‌ మ్యాచ్‌ రా ఇది. జాగ్రత్తగా ఆడు’ అని సునీల్‌ చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. 

ఇక, ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్ చూస్తుంటే ఖచ్చితంగా అంచనాలను అందుకుంటుందనే నమ్మకం కలుగుతోంది. ప్రస్తుతం 'ఊర్వశివో రాక్షసివో' (Urvasivo Rakshasivo) చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాను నవంబర్ 4న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 

Read More: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) భార్య స్నేహా రెడ్డి బర్త్ డే సందర్భంగా బన్నీ స్పెషల్ విషెస్..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!