బ్లాక్ డ్రెస్ లో స్టైలిష్ లుక్ లో అల్లు అర్జున్ (Allu Arjun).. సైమా అవార్డ్స్ కు బయల్దేరి వెళ్లిన బన్నీ..!

Published on Sep 11, 2022 01:27 PM IST

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన 'పుష్ప ది రైజ్' (Pushpa The Rise) సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఆ సినిమాకు సీక్వెల్‌గా 'పుష్ప2' సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాతో అల్లు అర్జున్‌కు దేశవ్యాప్తంగా క్రేజ్‌ వచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ’పుష్ప’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన.. సౌత్‌తో పాటు నార్త్‌ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకుంది.

తాజాగా బెంగుళూరులో జరగనున్న సైమా అవార్డ్స్ (Siima Awards) కి వెళ్లారు అల్లు అర్జున్. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్ లో ఆయన కనిపించారు. బ్లాక్ డ్రెస్ లో స్టైలిష్ లుక్ లో బన్నీను చూసిన అభిమానులు, మీడియా కెమెరాకి పని చెప్పారు. తన హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ తో ఆకట్టుకుంటున్నారు బన్నీ. ప్రస్తుతం ఈ లుక్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. 

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పుష్ప సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు సుకుమార్ (Ditector Sukumar). ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బన్నీ అభిమానులు. 'పుష్ప2' సినిమాపై ఒక వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్‌‌ 22వ తేదీ నుంచి జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తయిన సంగతి తెలిసిందే.

అలాగే 'పుష్ప2' (Pushpa 2) సినిమా పూర్తయిన తర్వాత అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్. 'అల వైకుంఠపురములో..' సినిమా తర్వాత త్రివిక్రమ్ ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు. తాజాగా మహేష్‌బాబుతో సినిమాను మొదలుపెట్టారు. 'ఎస్‌ఎస్‌ఎంబీ28' (SSMB 28) సినిమా పూర్తయిన తర్వాత బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం.

Read More: కూతురు అల్లు అర్హతో (Allu Arha) కలిసి వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న అల్లు అర్జున్ (Allu Arjun)..!