కూతురు అల్లు అర్హతో (Allu Arha) కలిసి వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న అల్లు అర్జున్ (Allu Arjun)..!

Published on Sep 08, 2022 04:01 PM IST

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) గ‌ణేష్ నిమ‌జ్జ‌న వేడుక‌ల్లో పాల్గొన్నారు. కూతురు అల్లు అర్హ‌తో (Allu Arha) క‌లిసి 'గ‌ణ‌ప‌తి బ‌ప్పా మోరియా ' అంటూ సంద‌డి చేశారు. అల్లు అర్జున్ నివాసం ద‌గ్గ‌ర‌లో కాల‌నీ వాసులు గ‌ణేష్ విగ్ర‌హాన్ని ప్రతిష్టింపజేశారు స్థానికులు. ఈ నేపథ్యంలో వినాయక నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మానికి అల్లు అర్జున్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా తన కూతురుతో క‌లిసి అల్లు అర్జున్ నిమ‌జ్జ‌న‌ వేడుక‌ల్లో పాల్గొన్నారు. ప్ర‌స్తుతం ఆ వీడియోలు, ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

కాగా, సినీ రంగం వారికి దైవ భ‌క్తి కూడా ఎక్కువే ఉంటుంది. ఏ సినిమా మొద‌లు పెట్టినా, పూజా కార్య‌క్ర‌మంతోనే ప్రారంభిస్తారు. ఇక వినాయ‌క చ‌వితి సమయంలోనైతే న‌టీన‌టులంతా గ‌ణేష్‌ను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజిస్తారు. త‌మ సినిమాల‌కు ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాల‌ని కోరుకుంటారు. ఇందులో భాగంగానే టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) కూడా త‌న కూతురితో క‌లిసి గ‌ణేష్ నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ (Allu Arjun) కు భార‌త సంప్ర‌దాయాలు, సంస్కృతిపై ఎంతో గౌరవం ఉందంటూ నెటిజ‌న్లు అంటున్నారు. త‌న ఇంట్లోని వినాయ‌కుడి విగ్రహాన్ని అల్లు అర్జున్ కాల‌నీ వాసుల‌కు అంద‌జేశారు. కూతురుతో క‌లిసి 'గ‌ణ‌ప‌తి బ‌ప్పా మోరియా ' అంటూ సంద‌డి చేశారు. ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో వినాయ‌కుడికి వీడ్కోలు ప‌లికారు. ఇక అల్లు అర్హా డాన్సుల‌తో, తీన్మార్ బ్యాండ్ వాయిస్తూ అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

ఇక, అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం ‘పుష్ప 2’లో (Pushpa 2) నటిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాన్నిఇటీవ‌లే నిర్వ‌హించారు. ‘పుష్ప : ది రూల్’ (Pushpa The Rule) సినిమాను ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ రేంజ్‌లో తెర‌కెక్కిస్తున్నారు. అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టించ‌నున్న ఈ సినిమాను రూ.350 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Read More: 'కెప్టెన్' (Captain) మూవీ ప్రమోషన్లలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ప్రశంసించిన కోలీవుడ్ హీరో ఆర్య (Hero Arya)