‘‘నో కమిట్ మెంట్, నో కంట్రోల్’’ అంటున్న హెబ్బా పటేల్ (Hebah Patel)... 'బ్లాక్ అండ్ వైట్' (B&W) టీజర్ రిలీజ్..!

Updated on Oct 28, 2022 04:20 PM IST
‘‘నో కమిట్ మెంట్, నో కంట్రోల్, నో రిస్ట్రిక్షన్స్..లైట్స్ సెలబ్రేట్ యువర్ ఫ్రీడమ్’’ అంటూ హెబ్బా చెప్పిన డైలాగ్స్ తో టీజర్ షురూ అవుతుంది.
‘‘నో కమిట్ మెంట్, నో కంట్రోల్, నో రిస్ట్రిక్షన్స్..లైట్స్ సెలబ్రేట్ యువర్ ఫ్రీడమ్’’ అంటూ హెబ్బా చెప్పిన డైలాగ్స్ తో టీజర్ షురూ అవుతుంది.

టాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ హెబ్బా పటేల్ (Hebah Patel) ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'బ్లాక్ అండ్ వైట్' (B&W). ఎన్ఎల్ వీ సూర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మేఘనా రెడ్డి సమర్పణలో ఎస్‌ఆర్‌ ఆర్ట్స్‌/ఏయూ, ఐ స్టూడియోస్‌ సంయుక్త భాగస్వామ్యంలో పద్మనాభ రెడ్డి, సందీప్ రెడ్డి నిర్మిస్తున్నారు. సూర్య శ్రీనివాస్, బిగ్ బాస్ బ్యూటీ లహరి శారి, నవీన్ నేని ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. 

తాజాగా 'బ్లాక్ అండ్ వైట్' (B&W) చిత్ర టీజర్‌ని ప్రముఖ సినీ రచయిత వి. విజయేంద్రప్రసాద్ (Vijayendra Prasad) ఆవిష్కరించారు. బటన్ నొక్కి ఆయన టీజర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. రొమాన్స్, యాక్షన్ సీన్లతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా టీజర్ సాగుతోంది. 

'బ్లాక్ అండ్ వైట్' (B&W) చిత్ర టీజర్‌ని ప్రముఖ సినీ రచయిత వి. విజయేంద్రప్రసాద్ (Vijayendra Prasad) ఆవిష్కరించారు.

‘‘నో కమిట్ మెంట్, నో కంట్రోల్, నో రిస్ట్రిక్షన్స్..లైట్స్ సెలబ్రేట్ యువర్ ఫ్రీడమ్’’ అంటూ హెబ్బా చెప్పిన డైలాగ్స్ తో టీజర్ షురూ అవుతుంది. సిగరెట్‌ తాగుతున్న హెబ్బా పటేల్ (Hebah Patel) తన చేతి వేలుకి రక్తం చూసి షాకవుతుంది. ఆ తర్వాత మీ స్వేచ్చను వేడుక చేసుకోండి.. అంటోంది. టీజర్‌ మధ్యలో రెండు షేడ్స్‌ ఉన్న లుక్‌లో కనిపిస్తోంది హెబ్బా పటేల్‌. సూర్య శ్రీనివాస్‌తో సహా చాలా పాత్రలను టీజర్‌లో అనుమానాస్పద రీతిలో చూపించారు. లహరి, నవీన్ నేని పాత్రలను కూడా టీజర్‌లో చూపించారు.
 

ఉత్కంఠభరితమైన ఈ టీజర్ (B&W Teaser).. థ్రిల్లర్ సినిమా ప్రేమికులను ఆకట్టుకునేలా ఉంది. ఇందులో యువతకు నచ్చే అంశాలు కూడా ఉన్నాయి. టీజర్‌ కట్‌తో దర్శకుడు సూర్య ప్రకాష్‌ ఆసక్తిని రేకెత్తించాడు. హీరోహీరోయిన్ల రొమాంటిక్‌ ట్రాక్‌ మధ్య ఏదో సస్పెన్స్‌ ఎలిమెంట్‌ ఉన్నట్టు హింట్‌ ఇచ్చాడు డైరెక్టర్‌. టీజర్ లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. టి సురేంద్ర రెడ్డి సినిమాటోగ్రఫీ హైలైట్ అవుతోంది. అజయ్ అరసాడ సంగీతం అందించారు.

ఈ ఏడాది 'ఓదెల రైల్వే స్టేషన్‌' (Odela Railway Station) సినిమాలో డీగ్లామరైజ్‌డ్‌ పాత్రలో నటించి.. అందరినీ మెప్పించింది హెబ్బాపటేల్‌. మొదట గ్లామరస్‌ పాత్రల్లో మెరిసిన ఈ భామ ఈ మధ్య నటనకు ఆస్కారమున్న కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకెళ్తోంది. 'బ్లాక్ అండ్ వైట్' (B&W) ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Read More: Yashoda Trailer: 'యశోద ఎవరో తెలుసు కదా! ఆ కృష్ణ పరమాత్ముడిని పెంచిన తల్లి'.. గర్భవతిగా సమంత (Samantha)!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!