రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) సంచలన ప్రకటన.. ఏపీ రాజకీయాల నేపథ్యంలో నెక్స్ట్ సినిమా?

Updated on Oct 28, 2022 01:07 PM IST
ఏపీ సీఎం జగన్‌తో (AP CM Jagan) భేటీ తర్వాత జగన్ తాను ఎలాంటి సినిమా తీయనున్నారో వెంటనే ప్రకటించారు ఆర్జీవీ (Ram Gopal Varma).
ఏపీ సీఎం జగన్‌తో (AP CM Jagan) భేటీ తర్వాత జగన్ తాను ఎలాంటి సినిమా తీయనున్నారో వెంటనే ప్రకటించారు ఆర్జీవీ (Ram Gopal Varma).

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ట్విటర్ వేదికగా ఓ సంచలన ప్రకటన చేశారు. తన తదుపరి చిత్రం రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతుందని ప్రకటించారు. ట్వీట్ తో పాటు ఓ ఆడియోను రిలీజ్ చేశారు. తన కొత్త సినిమాపై త్వరలో 'వ్యూహం' అనే రాజకీయ సినిమా తీస్తానని ఆర్జీవీ తన ట్వీట్ లో తెలిపారు. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించినదే 'వ్యూహం' కథ అని చెప్పారు. 

ఈ చిత్రం రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుంది. రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే “వ్యూహం” (Vyuham) చిత్రం. ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది.. మొదటి పార్ట్ “వ్యూహం”, రెండవ భాగం “శపథం”.. రెండింటిలోనూ రాజకీయ ఆరాచకీయాలు పుష్కలంగా ఉంటాయి అని తెలిపారు ఆర్జీవీ.  

‘‘ప్రేక్షకులు తొలి చిత్రం షాక్ నుంచి తేరుకునేలోపే వారికి ఇంకో ఎలక్ట్రిక్ షాక్ పార్ట్ 2 రూపంలో తగులుతుంది. నేను గతంలో తీసిన ‘వంగవీటి’ సినిమా నిర్మాత దాసరి కిరణ్ (Dasari Kiran) ఈ కొత్త చిత్రాన్నీ నిర్మిస్తున్నారు’’ అని ఆర్జీవీ వరుస ట్వీట్లు చేశారు. 

అయితే, ఏపీ సీఎం జగన్‌తో (AP CM Jagan) భేటీ తర్వాత జగన్ తాను ఎలాంటి సినిమా తీయనున్నారో వెంటనే ప్రకటించారు ఆర్జీవీ. జగన్‌తో మీటింగ్ జరిగిన ఒక్క రోజులోనే తాను రాజకీయ చిత్రం చేస్తున్నట్లుగా ప్రకటించారు. దాని పేరు కూడా ప్రకటించడంతో స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయి ఉంటుందని భావిస్తున్నారు. సీఎం జగన్‌తో ఆర్జీవీ భేటీ అయిన వెంటనే.. ఆయన నిర్మాణ సంస్థలో మూడు సినిమాలు రూపుదిద్దుకుంటాయన్న ప్రచారం జరిగింది. 

కాగా.. ఈ రెండు సినిమాలు పవన్ కల్యాణ్‌ను (Power Star Pawan Kalyan) టార్గెట్ చేస్తూ ఇతరులతో తీయిస్తారని.. జగన్ బయోపిక్‌ను మాత్రం ఆయన స్వయంగా దర్శకత్వం చేస్తారని.. జగన్ కు ఎలివేషన్లు ఇచ్చేలా ఈ సినిమా ఉంటుందన్న అభిప్రాయం వినిపించింది. ఇప్పుడు ఆర్జీవీ కూడా అదే పద్దతిలో ట్వీట్ చేశారు.

Read More: అషు రెడ్డి బర్త్ డే పార్టీలో (Ashu Reddy Birthday) కసితీరా కేక్ కట్ చేయించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV)!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!