సమంత (Samantha) తాజా సినిమా ‘యశోద’ (Yashoda) సినిమాకు సెన్సార్ పనులు పూర్తి.. ఏ సర్టిఫికెట్ ఇచ్చారంటే..?

Updated on Nov 04, 2022 01:57 PM IST
'యశోద' సినిమా సెన్సార్ (Censor) పనులు నేడు ముగించుకుంది. U/A సర్టిఫికెట్ అందుకున్న ఈ మూవీ నవంబర్ 11న విడుదల కాబోతుంది.
'యశోద' సినిమా సెన్సార్ (Censor) పనులు నేడు ముగించుకుంది. U/A సర్టిఫికెట్ అందుకున్న ఈ మూవీ నవంబర్ 11న విడుదల కాబోతుంది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) టైటిల్ పాత్రలో నటించిన తాజా సినిమా ‘యశోద’ (Yashoda). ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. సరోగసి నేపథ్యంలో సాగే కుట్రలు, యాక్షన్ అంశాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీని హరీష్, హరి ద్వయం కలిసి తెరకెక్కించారు.

తాజాగా విడుదలైన 'యశోద' థియేట్రికల్ ట్రైలర్‌ని టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) విడుదల చేయగా, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కాగా, ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషల్లో నవంబర్ 11న (Yashoda release date) విడుదల చేయబోతున్నారు.

'యశోద' (Yashoda) చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా.. డా.చల్లా భాగ్యలక్ష్మి, పులగం చిన్న నారాయణ మాటలు అందించారు. ఈ మూవీలో ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) కీలక పాత్రలో నటించారు.

ఇక ఈ సినిమా సెన్సార్ (Yashoda Censor) పనులు నేడు ముగించుకుంది. U/A సర్టిఫికెట్ అందుకున్న ఈ మూవీ నవంబర్ 11న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతుంది. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావటంతో మూవీ రిలీజ్‌కి మార్గాలన్నీ క్లియర్ అయినట్లే. సరోగసి.. మెడికల్ క్రైమ్‏ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీపై ఇప్పటికే అంచనాలను పెంచేసింది.

ఇక, ఇటీవల సమంత.. తాను 'మయోసైటిస్' వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించడంతో అభిమానులతో పాటు.. సినీ ప్రముఖులు షాకయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. ఇక సామ్ ప్రస్తుతం డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సరసన 'ఖుషి' (Kushi Movie) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఆమె నటించిన 'శాకుంతలం' (Shakuntalam) మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

Read More: 'యశోద'లో హాలీవుడ్ స్టంట్ మాస్టర్ శిక్షణలో యాక్షన్ సీన్స్ తో అదరగొట్టిన సమంత(Samantha).. మేకింగ్ వీడియో రిలీజ్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!