Liger: 'పుష్ప' సినిమా న‌చ్చింద‌న్న 'లైగ‌ర్' ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ (Puri Jagannadh)!

Updated on Aug 20, 2022 04:43 PM IST
 'పుష్ప' లానే 'లైగ‌ర్' (Liger) కూడా కొత్త క‌థ‌తో తెర‌కెక్కించాన‌ని ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ తెలిపారు. 'లైగ‌ర్' త‌ప్ప‌కుండా హిట్ సాధిస్తుంద‌న్నారు.
'పుష్ప' లానే 'లైగ‌ర్' (Liger) కూడా కొత్త క‌థ‌తో తెర‌కెక్కించాన‌ని ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ తెలిపారు. 'లైగ‌ర్' త‌ప్ప‌కుండా హిట్ సాధిస్తుంద‌న్నారు.

టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ (Puri Jagannadh) తెర‌కెక్కించిన చిత్రం 'లైగ‌ర్' (Liger) ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేసింది. 'లైగ‌ర్' సినిమా హీరో, హీరోయిన్లు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండేలు చిత్ర ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా ఉన్నారు. ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ కూడా 'లైగ‌ర్' ప్ర‌మోష‌న్ల‌ను స‌రికొత్త‌గా నిర్శ‌హిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా ప్ర‌మోష‌న్లు రాజ‌మౌళి మాత్ర‌మే కొత్త‌గా చేస్తార‌ని టాక్. ఇక పూరీ జ‌గ‌న్నాథ్ 'లైగ‌ర్' కోసం చేస్తున్న స్టంట్స్ చూసి ప్రేక్ష‌కులు అవాక్క‌వుతున్నారు. రాజ‌మౌళిని మించి సినిమా ప్ర‌మోష‌న్ల‌ను నిర్వ‌హిస్తున్నార‌ని పూరీని ప్ర‌శంసిస్తున్నారు. పూరీ జ‌గ‌న్నాథ్ 'పుష్ప‌'పై చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిగా మారాయి.

'పుష్ప' క్లైమాక్స్ న‌చ్చింది - పూరీ

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కిన చిత్రం 'పుష్ప‌'. ఈ సినిమాతో అల్లు అర్జున్‌కు నార్త్‌లో ఫాలోయింగ్ పెరిగింది. 'పుష్ప' సినిమాపై ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. 'పుష్ప' సినిమా క్లైమాక్స్ త‌న‌కు బాగా న‌చ్చింద‌న్నారు. హీరో, విల‌న్ ప్ర‌శాంతంగా కూర్చుని మాట్లాడుకోవ‌డం కొత్త‌గా అనిపించిందన్నారు. 'పుష్ప' లానే 'లైగ‌ర్' చిత్రం కూడా కొత్త క‌థ‌తో తెర‌కెక్కించాన‌న్నారు. 'లైగ‌ర్' (Liger) త‌ప్ప‌కుండా బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంద‌ని పూరీ జ‌గ‌న్నాథ్ తెలిపారు. 

 'పుష్ప' లానే 'లైగ‌ర్' (Liger) కూడా కొత్త క‌థ‌తో తెర‌కెక్కించాన‌ని ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ తెలిపారు. లైగ‌ర్ త‌ప్ప‌కుండా హిట్ సాధిస్తుంద‌న్నారు.

లైగ‌ర్ కూడా కొత్త క‌థే - పూరీ

'లైగ‌ర్' (Liger) సినిమాకు సంబంధించిన విశేషాల‌ను పూరీ జ‌గ‌న్నాథ్ ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. రోడ్డు ప‌క్క‌న టీ అమ్ముకునే ఓ త‌ల్లి త‌న కొడుకును ఎలా చూడాల‌నుకుంది?. అందుకోసం కొడుకును ఎలా పెంచింది?. చివ‌ర‌కు ఆ కొడుకు అమ్మ కోరిక నెర‌వేరుస్తాడా?.. వంటి అంశాల‌తో 'లైగ‌ర్' చిత్రీక‌రించాన‌న్నారు. లైగ‌ర్ క్లైమాక్స్  కూడా అంద‌ర‌కీ కొత్త‌గా అనిపిస్తుంద‌న్నారు పూరీ జ‌గ‌న్నాథ్.  

Read More: Liger: 'లైగర్' మేకింగ్ స్టిల్స్ విడుదల చేసిన చిత్ర యూనిట్.. అదరగొట్టిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!