ఆగిపోయిన రామ్ చరణ్​ (Ram Charan) 16వ సినిమా.. అధికారికంగా ప్రకటించిన మెగా పవర్ స్టార్ టీమ్ 

Updated on Nov 01, 2022 02:07 PM IST
రామ్ చరణ్​ (Ram Charan) ఆర్‌సీ 16 మూవీ ఆగిపోయింది. ఈ విషయాన్ని ఆయన టీమ్ అధికారికంగా ప్రకటించింది
రామ్ చరణ్​ (Ram Charan) ఆర్‌సీ 16 మూవీ ఆగిపోయింది. ఈ విషయాన్ని ఆయన టీమ్ అధికారికంగా ప్రకటించింది

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తర్వాతి సినిమాపై కొన్నాళ్లుగా ఊహాగానాలు వస్తున్నాయి. ‘జెర్సీ’ చిత్రం ఫేమ్ గౌతమ్ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) దర్శకత్వంలో ఓ భారీ సినిమాను రామ్ చరణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్‌సీ 16గా ప్రచారంలో ఉన్న ఈ మూవీ ఆగిపోయిందనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై రామ్ చరణ్​ టీమ్ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. 

గౌతమ్ తిన్ననూరి తీయాల్సిన ఆర్‌సీ 16 మూవీ ఆగిపోయిందని రామ్ చరణ్ టీమ్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ ప్రాజెక్టును నిలిపేసినట్లు ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది. ‘మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరిల ప్రాజెక్టు ఆగిపోయింది. అతి త్వరలోనే రామ్ చరణ్ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడిస్తాం’ అని ట్వీట్ చేసింది. అయితే.. ఈ చిత్రం ఎందుకు ఆగిపోయిందనే విషయంపై మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. 

నెక్స్ట్ ఎవరితో చేస్తారో?

కొన్ని కారణాల వల్ల చరణ్​–గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టు ఆగిపోయిందని ఈమధ్య గాసిప్స్ వచ్చాయి. చరణ్​ వేరొక దర్శకుడితో చర్చలు జరుపుతున్నాడని.. త్వరలోనే తాను నటించబోయే 16వ సినిమాకు సంబంధించి అప్డేట్ ఇస్తారని కథనాలు వచ్చాయి. ఇంతలోనే ఆయన టీమ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. గౌతమ్ తిన్ననూరితో సినిమా ఆగిపోయిందని స్పష్టం చేసింది. మరి, చరణ్ నెక్స్ట్ ఏ దర్శకుడితో సినిమా చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన నుంచి మెగా అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 

శరవేగంగా శంకర్ మూవీ షూటింగ్ 

రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ దిగ్దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. శంకర్ తనదైన శైలిలో సందేశాన్ని ఇస్తూనే భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తున్నారు. శ్రీకాంత్, అంజలి, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ బాణీలు సమకూర్చుతున్నారు.  

Read more: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రంభ (Rambha) ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్.. పిల్లలతో స్కూలు నుంచి వెళ్తుంటే..

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!