Akash Puri: పూరి జగన్నాథ్ దంపతుల మధ్య విడాకుల పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన ఆకాష్ పూరి!

Updated on Jun 22, 2022 11:41 PM IST
భార్యతో పూరి జగన్నాథ్, ఆకాష్ (Puri Jagannath With his Wife, Akash puri)
భార్యతో పూరి జగన్నాథ్, ఆకాష్ (Puri Jagannath With his Wife, Akash puri)

టాలీవుడ్ డాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూరీ.. హీరోయిన్ చార్మీల స్నేహం గురించి సోషల్ మీడియాలో పలు విధాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయడం అంటుంచితే.. పూరీ కనెక్స్ట్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి, వరుసగా సినిమాలను నిర్మిస్తున్నారు. 

ఈ క్రమంలో పూరీ - ఛార్మి (Charmee Kaur) కలిసి బయట పార్టీల్లో కనిపిస్తుండటంతో, వీళ్ల మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ జరుగుతోందని గాసిప్‌ రాయుళ్లు కథనాలు అల్లేశారు. అంతేకాదు, ఏకంగా పూరీ తన భార్యకు విడాకులు కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యాడంటూ వార్తలు రాసుకొచ్చారు. ఆ పుకార్లపై పూరీ కొడుకు ఆకాష్ పూరీ ఓపెన్ అయ్యారు. 

ఆకాష్ హీరోగా తెరకెక్కిన ‘చోర్ బజార్’ (Chor Bazar Movie) ఈనెల 24 థియేటర్స్‌లో విడుదల కానుంది. 'జార్జ్ రెడ్డి' దర్శకుడు జీవన్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆకాష్ పూరీకి, పూరీ విడాకుల గురించి ప్రశ్నలు తలెత్తడంతో వాటిపై మొట్టమొదటి సారిగా తను రియాక్ట్ అయ్యారు. 'మా నాన్న పరిస్థితి అస్సలు బాలేనప్పుడు.. ఆ విషయాలు మాకు తెలియకుండా అమ్మ ముందే జాగ్రత్తపడిందని' ఆకాష్ చెప్పుకొచ్చాడు. 

పూరి జగన్నాథ్ కుటుంబం (Puri Jagannath Family)

ఆకాష్ పూరీ (Akash Puri) మాట్లాడుతూ.. 'మేం బాగా చిన్నపిల్లలగా ఉన్నప్పుడే, హాస్టల్‌లో పెట్టేయడంతో ఇవేం తెలియక చాలా హ్యాపీగా ఉన్నామని పేర్కొన్నారు. మా నాన్న పెద్ద డైరెక్టర్.. మేం హ్యాపీ అనే ఫీలింగ్‌లో ఉన్నాము. కానీ కొన్నాళ్ల తరువాత మాకు ఆయన పరిస్థితి  అర్ధమైందని చెప్పుకొచ్చాడు. అన్నీ పోయాక,  మా నాన్న తిరిగి బౌన్స్ బ్యాక్ కావడం అద్భుతమని, అది ఎవరికీ సాధ్యం కానిదని అన్నారు. నాన్న అలా మళ్లీ నిలబడ్డారు అంటే.. అది మమ్మీ వల్లే' అని ఆకాష్ చెప్పుకొచ్చాడు. 

'అమ్మా, నాన్న విడాకులు తీసుకుంటారన్న వార్త నేనింతవరకు వినలేదు. నాన్నకు పెద్ద సపోర్ట్‌ మమ్మీనే. వాళ్లది లవ్‌ మ్యారేజ్‌. కొందరు టైంపాస్‌ కోసం వీరు విడాకులు తీసుకుంటున్నారంటూ ఇష్టం వచ్చినట్లు రాస్తూనే ఉంటారు. కానీ అదైతే నిజం కాదు. ఇక్కడ మీకో నిజం చెప్తాను.. మా పేరెంట్స్‌ లవ్‌లో ఉన్న సమయంలో, నాన్న అమ్మకు ఫోన్‌ చేసి పెళ్లి చేసుకుందాం, వస్తావా? అని అడిగాడు.

'హా, వచ్చేస్తానంది' అమ్మ. 'నా జేబులో రూ.200 మాత్రమే ఉన్నాయి. రేపు ఎలా ఉంటుందో కూడా తెలీదు, నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని మా నాన్న అడిగాడట. క్షణం కూడా ఆలోచించకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పి తనతో వచ్చేసింది. ఇంతలా ప్రేమించేవాళ్లు నిజంగా ఉంటారా? అనిపించింది' అని చెప్పుకొచ్చాడు ఆకాశ్‌.

 

చోర్ బజార్ మూవీ పోస్టర్ (Chor Bazar Movie Poster)

ప్రస్తుతం పూరీ - చార్మీలు మాత్రం ‘పూరీ కనెక్స్ట్’ (Puri Connects) తో బిజీగా ఉంటూ, వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. పార్టీలు, ప్రైవేట్ ఈవెంట్స్, సినిమా ఈవెంట్లలలో కలిసే కనిపిస్తున్నారు. ఈ క్రమంలో తన పేరెంట్స్ విడిపోతున్నారని.. విడాకులు తీసుకోబోతున్నారని వస్తున్న పుకార్లపై రియాక్ట్ అయ్యారు పూరీ కొడుకు ఆకాష్ పూరీ.

ఇతను నటించిన ‘చోర్ బజార్’ చిత్రం ఈనెల 24 థియేటర్స్‌లో విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆకాష్ పూరీకి పూరీ విడాకుల గురించి ప్రశ్నలు ఎదురుకావడంతో తను వాటిపై రియాక్ట్ అయ్యారు.

Read More: Pavithra Puri: సినీ రంగంలో నిర్మాతగా కొత్త కెరీర్ ప్రారంభిస్తున్న.. పూరీ జగన్నాథ్ కుమార్తె పవిత్ర !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!