రాత్రి గం.8:30లకు లైవ్ లో పూరీజ‌గ‌న్నాథ్ (Puri Jagannadh) తో చిరంజీవి (Chiranjeevi) ఇంటర్వ్యూ..!

Updated on Oct 15, 2022 04:15 PM IST
'గాడ్ ఫాదర్' సినిమా ప్రమోషన్లపై (Godfather Promotions) చిరంజీవి మరో ముందడుగు వేస్తున్నారు.
'గాడ్ ఫాదర్' సినిమా ప్రమోషన్లపై (Godfather Promotions) చిరంజీవి మరో ముందడుగు వేస్తున్నారు.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela) నటించిన ‘గాడ్‌ఫాదర్’ (GodFather) చిత్రం దసరా కానుకగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కమ్‌బ్యాక్‌లో సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న చిరుకు.. ‘గాడ్‌ఫాదర్’ సక్సెస్‌తో ఊరట కలిగింది. ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. దీంతో మెగా ఫ్యాన్స్ ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ ఆనందంలో మునిగిపోయారు.

రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ‘గాడ్‌ఫాదర్’ (GodFather) సినిమా తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ నటించడంతో నార్త్ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో హిందీ బెల్ట్‌లో మరో 600 స్క్రీన్స్‌ను పెంచారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 

 

ఇదిలా ఉంటే.. 'గాడ్ ఫాదర్' సినిమా ప్రమోషన్లపై (Godfather Promotions) చిరంజీవి మరో ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న చిరంజీవి ఇన్ స్టాగ్రామ్ ద్వారా తొలిసారి లైవ్ లోకి రాబోతున్నారు. డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి చిరంజీవి తన అభిమానులతో ముచ్చటించనున్నారు. ఈ విషయాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. నేటి రాత్రి 8:30 గంట‌ల‌కు ఇంట‌ర్వ్యూ లైవ్ ఉండ‌నుంది. చిరంజీవి అఫీషియ‌ల్ హ్యాండిల్‌, కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ ఖాతాల్లో స్ట్రీమింగ్ కానుంది.

కాగా, మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఓ సినిమా తెరకెక్కించాల‌ని పూరీజ‌గ‌న్నాథ్ (Puri Jagannadh) ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నా.. ప‌లు కార‌ణాల వల్ల వ‌ర్క‌వుట్ కాలేదు. కానీ అభిమానుల ఎదురుచూపుల‌కు ఫుల్ స్టాప్ పెడుతూ 'గాడ్ ఫాద‌ర్‌'లో చిరంజీవి (Chiranjeevi)తో క‌లిసి సిల్వ‌ర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు పూరీ. ఈ ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటాయి. ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్టుగా పూరీ పాత్ర సినిమాకు ప్ల‌స్ అనే అయ్యింద‌నే చెప్పవచ్చు.

Read More: 'లైగర్' (Liger) డిజాస్టర్ తో పారితోషికంలో భారీ మొత్తం తిరిగిచ్చేసిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)..?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!