సల్మాన్ ఖాన్(Salman Khan) కు చిరంజీవి(Chiranjeevi) ఖరీదైన గిఫ్ట్.. ‘గాడ్‌ఫాదర్’(GodFather)రెమ్యునరేషన్ ఎంతంటే?

Updated on Oct 13, 2022 12:22 PM IST
'గాడ్ ఫాదర్' (GodFather) సినిమాలో నటించిన సల్మాన్ ఖాన్ ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ తీసుకోలేదని చిరంజీవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
'గాడ్ ఫాదర్' (GodFather) సినిమాలో నటించిన సల్మాన్ ఖాన్ ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ తీసుకోలేదని చిరంజీవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన ‘గాడ్‌ఫాదర్’ (GodFather) చిత్రం దసరా కానుకగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. బుధవారం విడుదలైన 'గాడ్‌ఫాదర్' సినిమా శనివారం నాటికే రూ.100 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. దీంతో ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. దీంతో మెగా ఫ్యాన్స్ ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ ఆనందంలో మునిగిపోయారు.

రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ‘గాడ్‌ఫాదర్’ (GodFather) సినిమా తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ నటించడంతో నార్త్ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో హిందీ బెల్ట్‌లో మరో 600 స్క్రీన్స్‌ను పెంచారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 

సల్మాన్ ఖాన్ (Salman Khan) కోసం ఓ ఖరీదైన కారును రామ్ చరణ్‌తో (Ram Charan) కలిసి చిరు బహుమతిగా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట.

ఇదిలా ఉండగా చిరంజీవి కోరిక మేరకు 'గాడ్ ఫాదర్' (GodFather) సినిమాలో నటించిన సల్మాన్ ఖాన్ ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ తీసుకోలేదని చిరంజీవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ సినిమా విజయంలో సల్మాన్ ఖాన్ (Salman Khan) పాత్ర కూడా చాలా కీలకంగా ఉండటంతో, చిరు.. సల్మాన్‌కు ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. 

సల్మాన్ ఖాన్ కోసం ఓ ఖరీదైన కారును రామ్ చరణ్‌తో (Ram Charan) కలిసి చిరు బహుమతిగా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. త్వరలోనే ఈ సర్‌ప్రైజ్‌ను సల్మాన్‌కు అందించేందుకు రెడీ అవుతున్నారట మెగాస్టార్. 

మరోవైపు.. ‘గాడ్‌ఫాదర్’ (GodFather) సక్సెస్‌తో సంతోషంలో ఉన్న చిరు.. తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో పలు విషయాల గురించి ఆయన మాట్లాడారు. రీమేక్‌లు చేయడం సవాలుతో కూడుకున్నదని చిరు అన్నారు. "గతంలోనూ నేను రీమేక్స్‌ చేశా. అయితే, రామ్‌ చరణ్‌ చెప్పడం వల్లే ఈసారి ‘గాడ్‌ఫాదర్‌’లో యాక్ట్ చేశా. ఈ మూవీ నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. ఇందులో నా పాత్రకు డ్యాన్స్‌లు, కామెడీ డైలాగ్‌లు ఉండవు" అని చెప్పుకొచ్చారు.

Read More: నార్త్‌లో చిరంజీవి (Chiranjeevi Konidela) ‘గాడ్‌ఫాదర్’ (GodFather) హవా.. 600 స్క్రీన్లు పెంపు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!