ఛార్మితో (Charmme kaur) నాకున్న సంబంధం అదే.. తొలిసారి ఓపెన్ అయిన పూరి జగన్నాథ్ (Puri Jagannadh)

Updated on Aug 19, 2022 04:17 PM IST
పూరి, ఛార్మి (Charmme kaur) ఒకే ఇంట్లో ఉంటారు. కలిసి డ్రింక్ చేస్తారు. విహారాలకు వెళతారు. పూరి ఎక్కడుంటే ఛార్మి అక్కడుంటుంది.
పూరి, ఛార్మి (Charmme kaur) ఒకే ఇంట్లో ఉంటారు. కలిసి డ్రింక్ చేస్తారు. విహారాలకు వెళతారు. పూరి ఎక్కడుంటే ఛార్మి అక్కడుంటుంది.

గత కొన్నేళ్లుగా టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) తో కలిసి ప్రయాణాన్ని సాగిస్తోంది ఛార్మి (Charmme kaur). పూరి కనెక్ట్స్ బ్యానర్ స్థాపించిన ఈ జంట నిర్మాణ భాస్వాములుగా కొనసాగుతున్నారు. ఈ బ్యానర్ లో మొదటి చిత్రంగా 'జ్యోతిలక్ష్మి' తెరకెక్కింది. ఛార్మి ప్రధాన పాత్రలో పూరి తెరక్కించిన ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ అనుకున్న స్థాయిలో ఆడలేదు. అయినా జయాపజయాలతో సంబంధం లేకుండా ఓ ఆరు చిత్రాలు ఈ బ్యానర్ లో తెరకెక్కాయి. 

ప్రస్తుతం పూరి కనెక్ట్స్ బ్యానర్ లో 'లైగర్', 'జనగణమన' చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా ఉన్న ఈ రెండు ప్రాజెక్ట్స్ లో లైగర్ (Liger) ఆగస్టు 25న విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పూరి జగన్నాథ్ అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నటి ఛార్మితో తనకున్న రిలేషన్ గురించి ఓపెన్ అయ్యారు.

తాజాగా పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) మాట్లాడుతూ.. ఛార్మీ తనకు 13 ఏళ్ల వయసప్పటి నుంచి తెలుసని చెప్పారు. రెండు దశాబ్దాలుగా ఆమెతో కలిసి పని చేస్తున్నానని అన్నారు.ఒకవేళ, ఛార్మీకి 50ఏళ్లు ఉన్నట్లయితే ఎవరూ పట్టించుకునే వారు కాదని... ఆమెకు వేరే వారితో పెళ్లి జరిగినా పట్టించుకునే వారు కాదని... ఆమె ఇంకా యంగ్ గా ఉండటం వల్లే అఫైర్ ఉందని, అదీ ఇదీ అంటూ ఏదేదో మాట్లాడుకుంటున్నారని అన్నారు. ఒకవేళ మా మధ్య అఫైర్ ఉన్నా అది ఎక్కువ రోజులు నిలబడదని పేర్కొన్నారు. ఆకర్షణ అనేది కొన్ని రోజుల్లోనే చచ్చిపోతుందని.. స్నేహమే శాశ్వతమని చెప్పారు. ఎప్పటికీ తామిద్దరం మంచి ఫ్రెండ్సే అని కుండబద్దలు కొట్టారు.

కాగా.. పూరి, ఛార్మి (Charmme kaur) ఒకే ఇంట్లో ఉంటారు. కలిసి డ్రింక్ చేస్తారు. విహారాలకు వెళతారు. పూరి ఎక్కడుంటే ఛార్మి అక్కడుంటుంది. ఇవన్నీ బహిరంగంగానే చేస్తారు. అందులో ఎలాంటి దాపరికం ఉండదు. అయితే, ఛార్మి కారణంగా పూరి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడనే వాదన కూడా ఉంది. కాగా, గత కొన్ని సంవత్సరాలుగా పూరీ జగన్నాథ్, ఛార్మి మధ్య ఏదో ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే.

Read More: Liger: 'లైగర్' మేకింగ్ స్టిల్స్ విడుదల చేసిన చిత్ర యూనిట్.. అదరగొట్టిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!