తేజ సజ్జా (Teja Sajja) పుట్టినరోజు సందర్భంగా ‘హనుమాన్’ సినిమా టీజర్‌‌ రిలీజ్ చేసే చాన్స్‌

Updated on Aug 21, 2022 08:28 PM IST
తేజ సజ్జా (Teja Sajja) జాంబీరెడ్డి సినిమా తర్వాత హీరోగా నటిస్తున్న సినిమా హనుమాన్
తేజ సజ్జా (Teja Sajja) జాంబీరెడ్డి సినిమా తర్వాత హీరోగా నటిస్తున్న సినిమా హనుమాన్

జాంబీరెడ్డి సినిమాతో హీరోగా పరిచయమయ్యారు చైల్డ్ ఆర్టిస్ట్‌ తేజ సజ్జా (Teja Sajja). ఇంద్ర సినిమాలో చిరంజీవి చిన్నప్పటి క్యారెక్టర్‌‌లో నటించి మెప్పించారు తేజ. ప్రస్తుతం తేజ సజ్జా హీరోగా నటిస్తున్న సినిమా ‘హను మాన్’.

అ!, కల్కి, జాంబీరెడ్డి సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో సత్తా చాటుకున్నారు విలక్షణ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈసారి సూపర్ హీరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. వీరిద్దరి కాంబినేషన్‌పై కామన్‌గానే అంచనాలు భారీగా ఉన్నాయి.

తేజ సజ్జా (Teja Sajja) జాంబీరెడ్డి సినిమా తర్వాత హీరోగా నటిస్తున్న సినిమా హనుమాన్

రియల్ సూపర్ హీరో..

మన పురాణాల్లో రియల్ సూపర్ హీరో అయిన హనుమంతుడి మీద ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘హను -మాన్’. చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోగా మారిన తేజ సజ్జా హనుమాన్ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. 'అంజనాద్రి' ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీని కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.

లేటెస్ట్ బజ్ ప్రకారం మరో మూడ్రోజుల్లో హనుమాన్ మూవీ టీజర్ విడుదల కావొచ్చని అంటున్నారు. ఆగస్టు 23వ తేదీన తేజ సజ్జా (Teja Sajja) పుట్టినరోజు. ఈ సందర్భంగా హనుమాన్ సినిమా టీజర్ రావొచ్చని లేక గ్లింప్స్‌ వీడియో అయినా రిలీజ్ కావచ్చని ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు.

Read More : శృతిహాసన్ (Shruti Haasan) ఒక్కో సినిమాకు అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్నారా? ఇవ్వడానికి రెడీగా నిర్మాతలు


టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!