అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా మరో వైల్డ్ యాక్షన్ డ్రామా.. 'ఉగ్రం' (Ugram First Look) ఫస్ట్ లుక్ రిలీజ్!

Updated on Aug 22, 2022 06:02 PM IST
'ఉగ్రం' (Ugram) అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లో (First Look) అల్లరి నరేష్ రక్తపు మరకలతో షాకింగ్ లుక్ లో కనిపించారు.
'ఉగ్రం' (Ugram) అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లో (First Look) అల్లరి నరేష్ రక్తపు మరకలతో షాకింగ్ లుక్ లో కనిపించారు.

చాలా కాలం త‌ర్వాత ‘నాంది’ (Naandhi) చిత్రంతో టాలీవుడ్ లో మంచి కంబ్యాక్ ఇచ్చాడు హీరో అల్ల‌రి న‌రేశ్ (Allari Naresh). విజయ్ కనకమేడల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో న‌టునిగా తనలోని మ‌రో కోణాన్ని తెరపై ఆవిష్క‌రించారు నరేష్. కేవ‌లం కామెడీ హీరో క్యారెక్ట‌ర్ల‌కే తాను ప‌రిమితం కాద‌నీ, సీరియ‌స్ క్యారెక్ట‌ర్స్‌ను కూడా తాను సునాయాసంగా చేస్తాన‌ని ఆ సినిమాతో నిరూపించారు న‌రేశ్‌.   

'నాంది' (Naandhi) చిత్రంలో న‌రేష్ త‌న విల‌క్ష‌మైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను విపరీతంగా ఆక‌ట్టుకున్నారు. గ‌తేడాది ఫిబ్ర‌వరిలో విడుద‌లైన ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా మంచి విజ‌యం సాధించి అల్ల‌రి న‌రేష్ మార్కెట్‌ను అమాంతం పెంచింది. ఈ సినిమా ద్వారా విజ‌య్ క‌న‌క‌మేడ‌ల (Vijay Kanakamedala) ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు గొప్ప ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుంది. తాజాగా.. ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 'ఉగ్రం' (Ugram) అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లో (First Look Poster) అల్లరి నరేశ్ రక్తపు మరకలతో షాకింగ్ లుక్ లో కనిపించారు. వీపు వెనుక గుచ్చుకున్న కత్తితో నిజంగానే ఉగ్ర రూపంలో నరేష్ లుక్ ఉంది. ఇక, ఈ పోస్టర్ చూస్తుంటే.. ఈ చిత్రం పూర్తి వైల్డ్ యాక్షన్ డ్రామాగా అనిపిస్తోంది.  

క్రైమ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్నఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ధి నిర్మిస్తున్నారు. శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల సంగీతం స‌మ‌కూరుస్తున్న 'ఉగ్రం' (Ugram Movie) చిత్రానికి సిద్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, చోటా కె. ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా, బ్ర‌హ్మ క‌డ‌లి ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే మేక‌ర్స్‌ ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలను వెల్లడించ‌నున్నారు.

Read More: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ రిలీజ్..  న‌రేష్ (Allari Naresh) బ‌ర్త్ డే స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!