ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ రిలీజ్..  న‌రేష్ (Allari Naresh) బ‌ర్త్ డే స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్ !

Updated on Jun 30, 2022 02:50 PM IST
న‌రేష్  (Allari Naresh) పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజ‌ర్ రిలీజ్.
న‌రేష్ (Allari Naresh) పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజ‌ర్ రిలీజ్.

టాలీవుడ్‌లో అల్ల‌రి సినిమాతో ఎంట్రీ ఇచ్చారు న‌రేష్. ఆ సినిమా త‌ర్వాత అల్ల‌రి న‌రేష్‌ (Allari Naresh) గా ప్రేక్ష‌కుల‌కు వినోదం అందిస్తున్నారు. న‌రేష్ పుట్టిన రోజు జూన్ 30. ఈ సంద‌ర్భంగా నరేష్ 59వ సినిమా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' నుంచి నిర్మాతలు టీజ‌ర్ రిలీజ్ చేశారు. అటవీ ప్రాంత ప్ర‌జల జీవితాల నేపథ్యంలో 'ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం' సినిమాను ద‌ర్శ‌కుడు ఎఆర్‌ మోహ‌న్ తెర‌కెక్కించారు. ఈ మూవీని రాజేష్ దండు, బాలాజీ గుత్త నిర్మిస్తున్నారు. హీరోయిన్ ఆనంది న‌రేష్‌కు జోడిగా న‌టిస్తున్నారు. 

'అల్ల‌రి' సినిమా త‌ర్వాత న‌రేష్ (Allari Naresh) ప‌లు కామెడీ సినిమాల్లో న‌టించి మెప్పించారు. సూప‌ర్ హిట్‌లు సాధించారు. ఆ త‌ర్వాత చాలా రోజుల వ‌ర‌కు న‌రేష్ ఫ్లాపుల‌తో గ‌డిపారు. 'గ‌మ్యం' లాంటి సినిమాల్లో న‌టించి మంచి పేరు తెచ్చుకున్నారు. హీరోగానే కాకుండా కీల‌క పాత్ర‌ల్లో కూడా న‌టించి త‌న స‌త్తా చాటారు. ప్ర‌స్తుతం సీరియస్ క‌థల‌తో వెండితెర‌పై క‌నిపించ‌నున్నారు అల్ల‌రి న‌రేష్. 

అటవీ ప్రాంత ప్రజలతో ఓట్లు వేయించే పోలింగ్ అధికారిగా అల్ల‌రి న‌రేష్ ఈ సినిమాలో క‌నిపించ‌నున్నారు. జ‌నాల‌తో ఓట్లు వేయించే క్రమంలో అల్ల‌రి న‌రేష్ ఎలాంటి స‌వాళ్ల‌ను ఎదుర్కొంటాడన్నది సినిమా క‌థాంశం. 'ఇట్లు మారేడుమిల్లి' ప్రజానీకం సినిమాలో అల్ల‌రి న‌రేష్ నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. 

 

అడ‌వుల్లో షూటింగ్
ఇటీవలే మారేడుమిల్లి అడవుల్లో అల్ల‌రి న‌రేష్‌ (Allari Naresh) నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ప‌లు సీన్స్‌ను దర్శకులు చిత్రీక‌రించారు.  అంతే కాకుండా, దాదాపు 22 కొత్త లొకేష‌న్స్‌లో షూటింగ్ జ‌రిపారు. ఆ లొకేష‌న్స్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఏ షూటింగ్ జ‌ర‌గ‌లేద‌ట‌. చిత్ర యూనిట్ 55 రోజుల పాటు నిరంతరాయంగా షూటింగ్ జరిపి ఎట్టకేలకు పూర్తి చేశారు. దాదాపు 250 మందితో ఈ సినిమాను చిత్రీక‌రించారు. ఈ చిత్రానికి శ్రీ చ‌ర‌ణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. వెన్న‌ల కిషోర్, ప్ర‌వీణ్ కీల‌క పాత్ర‌లలో న‌టిస్తున్నారు. 

Read More : అల్లరి నరేష్‌ (Allari Naresh) ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు.. కొత్త సినిమా ఫస్ట్ లుక్‌ రిలీజ్‌ చేసిన చిత్ర యూనిట్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!