HBD Allari Naresh: అల్ల‌రి న‌రేష్ బ‌ర్త్ డే స్పెష‌ల్ .. కామెడీతో 'కితకితలు' పెట్టిన వెండితెర 'సీమటపాకాయ్' !

Updated on Jun 30, 2022 08:14 PM IST
HBD Allari Naresh: టాలీవుడ్ కామెడీ హీరో అల్ల‌రి న‌రేష్ బ‌ర్త్ డే స్పెష‌ల్
HBD Allari Naresh: టాలీవుడ్ కామెడీ హీరో అల్ల‌రి న‌రేష్ బ‌ర్త్ డే స్పెష‌ల్

Allari Naresh: టాలీవుడ్‌లో ప్రేక్షకులకు కామెడీతో కిత‌కిత‌లు పెట్టిన‌ హీరో అల్ల‌రి న‌రేష్. 'అల్ల‌రి' సినిమాతో ఈయన తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు. అదే అల్లరితో వెండితెరపై హాస్య చిత్రాల రారాజయ్యాడు. ఈ యంగ్ హీరో తన మొద‌టి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకుని.. అల్ల‌రి న‌రేష్‌గా జనాలలో పాపులర్ అయ్యాడు.

హిట్, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచాల‌నే ల‌క్ష్యంతో న‌రేష్ ముందుకు సాగిపోతున్నాడు. తన  తండ్రి ఇవివి సత్యనారాయణ మాదిరిగానే తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేయడమే లక్ష్యంగా దూసుకుపోతున్న నటుడు అల్లరి నరేష్. న‌రేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ స్పెష‌ల్ స్టోరీ మీకోసం 

HBD Allari Naresh: అల్ల‌రి న‌రేష్‌కు సినిమా అంటే ప్రాణం. కామెడీతోనే కాదు.. ఈయన సీరియ‌స్ పాత్ర‌ల‌తోనూ ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు.

బాల్యం
అల్ల‌రి న‌రేష్ తండ్రి ప్ర‌ముఖ ద‌ర్శ‌క, నిర్మాత‌ ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ‌. ఈవీవీ అంటే తెలియ‌ని వారుండ‌రు. సూపర్ డూపర్ కామెడీ సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన స్టార్ డైరెక్ట‌ర్ ఈవీవీ. ఈవీవీ చిన్న కుమారుడే న‌రేష్. తండ్రి పెద్ద డైరెక్ట‌ర్ అయినా, న‌రేష్ మాత్రం చిన్న డైరెక్ట‌ర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 2002లో ర‌విబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'అల్ల‌రి' సినిమాతో నరేష్ హీరోగా వెండితెరకు ప‌రిచ‌య‌మ‌య్యారు. సినిమా పేరే ఆ తర్వాత తన ఇంటి పేరుగా మారిపోయింది. దీంతో అల్ల‌రి న‌రేష్‌గా పాపుల‌ర్ అయ్యారు. 

HBD Allari Naresh: అల్ల‌రి న‌రేష్‌కు సినిమా అంటే ప్రాణం. కామెడీతోనే కాదు సీరియ‌స్ పాత్ర‌ల‌తోనూ వినోదం పంచుతున్నారు.

వైవిధ్య‌మైన పాత్ర‌లలో ఒదిగిపోయిన న‌రేష్
'గ‌మ్యం' సినిమాలో గాలి శ్రీను పాత్ర‌లో న‌టించిన న‌రేష్ న‌ట‌న‌కు ఎన్నో అవార్డులు వ‌రించాయి. ఆ పాత్రకి నంది పురస్కారంతో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా ల‌భించింది. అలాగే 'శంభో శివ శంభో' చిత్రంలో మ‌ల్లి పాత్ర‌కు కూడా మంచి గుర్తింపు వ‌చ్చింది. 2014లో ల‌డ్డు బాబుగా ర‌విబాబు ద‌ర్శ‌క‌త్వంలో నరేష్ ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో న‌టించారు. ఇదే క్రమంలో ల‌డ్డు బాబుగా అల్ల‌రి న‌రేష్ వెరైటీ గెట‌ప్‌లో సైతం క‌నిపించారు. 'మ‌హ‌ర్షి' సినిమాలో మ‌హేష్ బాబుకు ఫ్రెండ్‌గా అల్ల‌రి న‌రేష్ చేసిన పాత్ర‌కు ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. 

HBD Allari Naresh: అల్ల‌రి న‌రేష్‌కు సినిమా అంటే ప్రాణం. కామెడీతోనే కాదు సీరియ‌స్ పాత్ర‌ల‌తోనూ వినోదం పంచుతున్నారు.

అల్ల‌రి న‌రేష్ సినిమాలు
అల్ల‌రి త‌ర్వాత న‌రేష్ 'ధనలక్ష్మీ ఐ లవ్  యూ' సినిమాలో న‌టించారు. ఆ త‌ర్వాత తొట్టిగ్యాంగ్, జూనియర్స్, ప్రాణం, మా అల్లుడు వెరీగుడ్, నేను, కితకితలు, గోపీ - గోడ మీద పిల్లి, సీమ శాస్త్రి, విశాఖ ఎక్స్‌ప్రెస్, పెళ్ళి కాని ప్రసాద్ వంటి కామెడీ చిత్రాల‌తో అల‌రించారు. అల్ల‌రి న‌రేష్‌కు 'గ‌మ్యం' సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

HBD Allari Naresh: అల్ల‌రి న‌రేష్‌కు సినిమా అంటే ప్రాణం. కామెడీతోనే కాదు సీరియ‌స్ పాత్ర‌ల‌తోనూ వినోదం పంచుతున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో కామెడీ సినిమాలు, పేర‌డీ చిత్రాలు చేయ‌డంలో రాజేంద్ర ప్రసాద్ సిద్ధహస్తులు. ఆయన త‌ర్వాత అల్ల‌రి న‌రేష్ అంత‌టి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతో మంది క‌మెడియ‌న్ల‌కు త‌న సినిమాల ద్వారా అల్ల‌రి న‌రేష్ లైఫ్ ఇచ్చారు. బ్లేడ్ బాబ్జీ, బెండు అప్పారావు RMP, లడ్డు బాబు, సిల్లీ ఫెలోస్, బంగారు బుల్లోడు వంటి సినిమాల్లో న‌టించి జనాలను న‌వ్వించారు. 

HBD Allari Naresh: అల్ల‌రి న‌రేష్‌కు సినిమా అంటే ప్రాణం. కామెడీతోనే కాదు సీరియ‌స్ పాత్ర‌ల‌తోనూ వినోదం పంచుతున్నారు.

సినిమా అంటే న‌రేష్‌కు ప్రాణం
2002 నుంచి 2022 వ‌ర‌కు అంటే 20 ఏళ్లుగా న‌రేష్ ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తూనే ఉన్నారు. అంత‌కు ముందు కామెడీ సినిమాల‌పైనే ఫోక‌స్ పెట్టిన న‌రేష్ .. ప్ర‌స్తుతం బ‌లమైన క‌థ‌లున్న చిత్రాల్లో న‌టిస్తున్నారు. కామెడీ పాత్ర‌ల్లో ఎంత న‌వ్వించారో.. సీరియ‌స్ పాత్ర‌ల్లో కూడా అంతే వినోదం పంచుతున్నారు. 2015 త‌ర్వాత న‌రేష్ సినిమాలు అనుకున్నంత హిట్ కాలేదు. కానీ న‌రేష్ తీసుకున్న నిర్ణ‌యంతో ప్రేక్ష‌కులు ఆశ్చ‌ర్య పోయారు. క్యారెక్టర్ రోల్స్ చేయడానికి కూడా ఆయన సిద్ధపడ్డారు. 'మ‌హ‌ర్షి' సినిమాలో మ‌హేష్ బాబుకు ఫ్రెండ్‌గా న‌టించి అంద‌రినీ అల‌రించారు. 

HBD Allari Naresh: అల్ల‌రి న‌రేష్‌కు సినిమా అంటే ప్రాణం. కామెడీతోనే కాదు సీరియ‌స్ పాత్ర‌ల‌తోనూ వినోదం పంచుతున్నారు.

నాందితో అద‌ర‌గొట్టిన‌ న‌రేష్
న‌రేష్ 'నాంది' సినిమాతో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చారు. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాగా 'నాంది' తెర‌కెక్కింది. ఈ సినిమాలో న‌రేష్ తీర్పు కోసం ఎదురుచూస్తున్న అండర్ ట్రయల్ ఖైదీ పాత్ర‌లో న‌టించి మెప్పించారు. ప్ర‌స్తుతం న‌రేష్ 'సభకు నమస్కారం',  'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' చిత్రాల్లో న‌టిస్తున్నారు. 

న‌రేష్‌కు న‌చ్చిన హీరో అక్కినేని నాగార్జున‌. అలాగే ఫేవ‌రెట్ హీరోయిన్ శ్రీదేవి. న‌రేష్ మ‌హేష్ బాబుతో 'మ‌హ‌ర్షి' సినిమాలో న‌టించారు. మ‌హేష్ బాబు అంటే వ్యక్తిగతంగా న‌రేష్‌కు చాలా ఇష్ట‌మ‌ట‌. మ‌హేష్ బాబు తన స్టేటస్‌ను సైతం పక్కన పెట్టి, అంద‌రితోనూ ఎంతో విన‌యంగా ఉంటార‌న్నారు న‌రేష్‌.

HBD Allari Naresh: అల్ల‌రి న‌రేష్‌కు సినిమా అంటే ప్రాణం. కామెడీతోనే కాదు సీరియ‌స్ పాత్ర‌ల‌తోనూ వినోదం పంచుతున్నారు.

న‌రేష్ కుటుంబం
2009లో న‌రేష్ విరూప‌ను పెళ్లి చేసుకున్నారు.  వీరికి ఓ పాప‌. న‌రేష్ త‌న పాప‌ను ఎంతో గారాబంగా చూసుకుంటార‌ట‌. న‌రేష్‌కు త‌న తండ్రి అంటే ఎంతో ఇష్టం. త‌న తండ్రి ఆరోగ్యం క్షీణించిన‌ప్పుడు ర‌క్తదానం ఎంత విలువైందో తెలుసుకున్నారు. ప్ర‌తీ మూడు నెల‌ల‌కోసారి న‌రేష్ బ్ల‌డ్ డొనేట్ చేస్తార‌ట‌. అంతేకాకుండా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలను న‌రేష్ నిర్వ‌హిస్తుంటారు. 
 
HBD Allari Naresh: అల్ల‌రి న‌రేష్‌కు సినిమా అంటే ప్రాణం. కామెడీతోనే కాదు సీరియ‌స్ పాత్ర‌ల‌తోనూ వినోదం పంచుతున్నారు.

బ‌ర్త్ డే సెల‌బ్రేట్ చేసుకోని న‌రేష్
న‌రేష్ బెస్ట్ ఫ్రెండ్ ఒక‌రు సూసైడ్ చేసుకుని చ‌నిపోయారు. ఆ ఫ్రెండ్  ప్ర‌తీ బ‌ర్త్ డేకు కేక్, గ్రీటింగ్ కార్డుతో న‌రేష్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేవార‌ట‌. అలాంటి బెస్ట్ ఫ్రెండ్ లేక‌పోవ‌డంతో న‌రేష్ త‌న పుట్టిన రోజు వేడుక‌ల‌కు దూర‌మ‌య్యార‌ట‌.  

HBD Allari Naresh: అల్ల‌రి న‌రేష్‌కు సినిమా అంటే ప్రాణం. కామెడీతోనే కాదు సీరియ‌స్ పాత్ర‌ల‌తోనూ వినోదం పంచుతున్నారు.

తండ్రి బాట‌లో న‌రేష్!
తండ్రి ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ బాట‌లోనే న‌రేష్ భవిష్యత్తులో ప్రయాణించాలని భావిస్తున్నారట. ద‌ర్శ‌కుడిగా సినిమాలు రూపొందించాల‌నేది న‌రేష్ క‌ల. త్వరలో న‌రేష్ డైరెక్ష‌న్‌లో సినిమాలు తెర‌కెక్క‌నున్నాయి. కూల్ ప‌ర్స్‌న్‌గా ఇండ‌స్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు నరేష్. ఆయన మరిన్ని మంచి సినిమాలలో నటించాలని పింక్‌విల్లా కోరుకుంటోంది. 

Read More: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ రిలీజ్..  న‌రేష్ (Allari Naresh) బ‌ర్త్ డే స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్ !

HBD Allari Naresh: అల్ల‌రి న‌రేష్‌కు సినిమా అంటే ప్రాణం. కామెడీతోనే కాదు సీరియ‌స్ పాత్ర‌ల‌తోనూ వినోదం పంచుతున్నారు.

హ్యాపీ బ‌ర్త్ డే న‌రేష్
పింక్ విల్లా
 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!